Share News

జీరో డోరు నెంబరుతో 259 ఓట్లు

ABN , First Publish Date - 2023-11-18T00:47:09+05:30 IST

పూతలపట్టు నియోజకవర్గంలో సున్నా డోరు నెంబరుతో 259 ఓట్లు ఉన్నాయి. ఒకే డోరు నెంబరుతో 10 కంటే ఎక్కువ మంది ఉన్న ఓట్లు 1702’ అని టీడీపీ నాయకులు గుర్తించారు. దీనిపై టీడీపీ నాయకులతో కలిసి ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి మురళి శుక్రవారం రాత్రి చిత్తూరు ఆర్డీవో చిన్నయ్యకు ఫిర్యాదు చేశారు.

జీరో డోరు నెంబరుతో 259 ఓట్లు
చిత్తూరు ఆర్డీవోకు ఫిర్యాదు చేస్తున్న టీడీపీ నాయకులు

ఆర్డీవోకు పూతలపట్టు టీడీపీ నేతల ఫిర్యాదు

చిత్తూరు రూరల్‌, నవంబరు 17: ‘పూతలపట్టు నియోజకవర్గంలో సున్నా డోరు నెంబరుతో 259 ఓట్లు ఉన్నాయి. ఒకే డోరు నెంబరుతో 10 కంటే ఎక్కువ మంది ఉన్న ఓట్లు 1702’ అని టీడీపీ నాయకులు గుర్తించారు. దీనిపై టీడీపీ నాయకులతో కలిసి ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి మురళి శుక్రవారం రాత్రి చిత్తూరు ఆర్డీవో చిన్నయ్యకు ఫిర్యాదు చేశారు. బంగారుపాళ్యంకు చెందిన జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్‌, పూతలపట్టు టీడీపీ అధ్యక్షుడు దొరబాబు చౌదరి, జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-18T00:47:11+05:30 IST