6,692 రాహుకేతు పూజలు
ABN , First Publish Date - 2023-04-09T00:13:25+05:30 IST
శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం రికార్డు స్థాయిలో 6,692 రాహుకేతు పూజలు జరిగాయి. మరోవైపు వరుస సెలవులతో ముక్కంటి ఆలయం భక్తజన సంద్రంగా మారింది.
ఒక్క రోజులో ఇదే సరికొత్త రికార్డు
భక్తులతో కిక్కిరిసిన ముక్కంటి ఆలయం
శ్రీకాళహస్తి, ఏప్రిల్ 8: శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం రికార్డు స్థాయిలో 6,692 రాహుకేతు పూజలు జరిగాయి. మరోవైపు వరుస సెలవులతో ముక్కంటి ఆలయం భక్తజన సంద్రంగా మారింది. దేశ నలుమూలల నుంచే కాకుండా ఇటీవల విదేశీ భక్తులు సైతం దోష పూజలు జరిపించుకునేందుకు విచ్చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రూ.500 టిక్కెట్లపై 3,611, రూ.750 టిక్కెట్లపై 1,976, రూ.1,500 పూజా టిక్కెట్లపై 562, రూ.2,500 పూజా టిక్కెట్లపై 424, రూ.5వేల పూజా టిక్కెట్లపై 119 మొత్తం కలిపి ఒక్కరోజులో 6,692 నమోదు కావడం సరికొత్త రికార్డుగా నిలిచింది. ఉదయం రాహుకాలం సమయంలో దోష పూజలు జరిపించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఇక ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కూడా గరిష్టస్థాయిలో అమ్ముడయ్యాయి. రూ.200 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు 3,372, రూ.50 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు 2,956 అమ్ముడైనట్లు ఆలయాధికారులు తెలిపారు.