అల్లనేరేడు చెట్టంతా పూతే
ABN , First Publish Date - 2023-04-21T01:58:48+05:30 IST
అల్లనేరేడు చెట్టంతా పూత విరగ్గాసింది. మామిడితో నష్టపోయి నిరాశ పడుతున్న రైతన్నకు పొలాల వద్ద ఉన్న అల్లనేరేడు చెట్లు కొంత ఊరటనిస్తున్నాయి.
సోమల, ఏప్రిల్ 20: అల్లనేరేడు చెట్టంతా పూత విరగ్గాసింది. మామిడితో నష్టపోయి నిరాశ పడుతున్న రైతన్నకు పొలాల వద్ద ఉన్న అల్లనేరేడు చెట్లు కొంత ఊరటనిస్తున్నాయి. సోమల మండలంలోని పెద్దఉప్పరపల్లె, కరకమంద, నెల్లిమంద, ఇరికిపెంట, సోమల తదితర ప్రాంతాల రైతులు మామిడి తోటల్లో మామిడితో పాటు అల్లనేరేడు చెట్లు నాటుకున్నారు. ప్రస్తుతం అల్లనేరేడు పూత దశలో ఉన్నాయి. అల్లనేరేడు చెట్ల ఏడాది ఫలసాయాన్ని వ్యాపారులు పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు. సీజన్‌లో కిలో రూ.200 వరకు వ్యాపారులు అమ్ముతున్నారు. వ్యాపారస్తులే అల్లనేరేడు చెట్లకు మందులు పిచికారీ చేపడుతున్నారు. ఒక్కో చెట్టు ఫలసాయాన్ని రూ.50 వేల నుంచి రూ 90వేల వరకు రైతులు ఫలసాయాన్ని అమ్ముతున్నారు.