వరసిద్ధుడి సేవలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి
ABN , Publish Date - Dec 24 , 2023 | 12:35 AM
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకటజ్యోతిర్మయి కుటుంబ సమేతంగా శనివారం కాణిపాక వరసిద్ధుడిని దర్శించుకున్నారు.
ఐరాల(కాణిపాకం), డిసెంబరు 23: ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకటజ్యోతిర్మయి కుటుంబ సమేతంగా శనివారం కాణిపాక వరసిద్ధుడిని దర్శించుకున్నారు. ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి ఆలయ మర్యాదలతో ఆహ్వానించి, దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ సూపరింటెండెంట్ కోదండపాణి, ఇన్స్పెక్టర్ రమేష్, చిత్తూరు డీఎస్పీ శ్రీనివాసమూర్తి, సీఐ రవిశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.