ఏఆర్ కానిస్టేబుల్ మృతి
ABN , First Publish Date - 2023-05-19T00:47:41+05:30 IST
చిత్తూరులో గురువారం ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందారు.
చిత్తూరు, మే 18: చిత్తూరులో గురువారం ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందారు. ఐరాల మండలం బెస్తపల్లెకు చెందిన పురుషోత్తం(38) ఏఆర్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. చిత్తూరులోని పీసీఆర్ కళాశాల వద్ద గురువారం విధులు నిర్వహిస్తుండగా ఉన్నట్లుండి గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయారు. స్థానికంగా ఉన్నవారు, పోలీసులు కలిసి చిత్తూరు ప్రభుత్వాస్పతికి తీసుకెళ్లి పరీక్షలు చేయగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు.