భక్తజనసంద్రం ముక్కంటి ఆలయం

ABN , First Publish Date - 2023-08-07T02:56:18+05:30 IST

శ్రీకాళహస్తీశ్వరాలయం ఆదివారం భక్తజనసంద్రంగా మారింది.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే గాక పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు.

భక్తజనసంద్రం ముక్కంటి ఆలయం

శ్రీకాళహస్తి, ఆగస్టు 6: శ్రీకాళహస్తీశ్వరాలయం ఆదివారం భక్తజనసంద్రంగా మారింది.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే గాక పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. సుమారు 30వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రూ.200 శీఘ్ర దర్శనం టిక్కెట్ల ద్వారా 937మంది, రూ.50ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా 1,971మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక రూ.500 రాహుకేతు టిక్కెట్ల ద్వారా 2,503మంది, రూ.750 టిక్కెట్ల ద్వారా 1,155 మంది, రూ.1,500 టిక్కెట్ల ద్వారా 311మంది, రూ.2,500 టిక్కెట్ల ద్వారా 278మంది, రూ.5వేలు టిక్కెట్ల ద్వారా 78మంది భక్తులు పూజలు చేయించుకున్నారు. ఇక ఐదు రకాల ప్రసాదాలు కలిపి 15,627 అమ్ముడైనట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Updated Date - 2023-08-07T02:56:18+05:30 IST