బస్సులు కిటకిట
ABN , First Publish Date - 2023-11-27T01:43:52+05:30 IST
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని తమిళనాడులోని తిరువణ్ణామలైలో గిరి ప్రదక్షిణ చేసేందుకు పెద్దయెత్తున భక్తులు తరలివెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి పున్నమి గడియలు మొదలు కావడంతో ఉదయం నుంచి ప్రయాణికులు పెద్దయెత్తున సెంట్రల్ బస్టేషన్‌కు చేరుకున్నారు.
తిరుపతి(కొర్లగుంట), నవంబరు 26 : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని తమిళనాడులోని తిరువణ్ణామలైలో గిరి ప్రదక్షిణ చేసేందుకు పెద్దయెత్తున భక్తులు తరలివెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి పున్నమి గడియలు మొదలు కావడంతో ఉదయం నుంచి ప్రయాణికులు పెద్దయెత్తున సెంట్రల్ బస్టేషన్‌కు చేరుకున్నారు. రెండు రోజులకు కలిపి 200 బస్సులను కేటాయించారు. అందులో 60 రిజర్వేషన్‌కు పెట్టారు. పది నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంచినా రోజంతా రద్దీ కొనసాగింది. సంబంధిత ప్లాట్‌ఫాం పూర్తిగా తిరువణ్ణామలై భక్తులతో కిక్కిరిసింది. పౌర్ణమి గడియలు సోమవారం మధ్యాహ్నం వరకు ఉండడంతో ప్రత్యేక బస్సులను అంతవరకు అందుబాటులో ఉంచారు.