ఇంకా తెరుచుకోని చెంగాళమ్మ ఆలయం
ABN , First Publish Date - 2023-12-08T01:48:39+05:30 IST
తలుపు లేని తల్లిగా 24 గంటలూ దర్శనమిచ్చే.. తెలుగు, తమిళ భక్తుల ఆరాధ్య దైవమైన చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయం మూడ్రోజులుగా మూతలోనే ఉంది. తుఫాను ప్రభావంతో నెర్రికాలువ పొంగి సోమవారం రాత్రి వరదనీరు ఆలయ గర్భాలయంలోకి చేరి, అమ్మవారి విగ్రహం కూడా మునిగిన విషయం తెలిసిందే.
సూళ్లూరుపేట, డిసెంబరు 7: తలుపు లేని తల్లిగా 24 గంటలూ దర్శనమిచ్చే.. తెలుగు, తమిళ భక్తుల ఆరాధ్య దైవమైన చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయం మూడ్రోజులుగా మూతలోనే ఉంది. తుఫాను ప్రభావంతో నెర్రికాలువ పొంగి సోమవారం రాత్రి వరదనీరు ఆలయ గర్భాలయంలోకి చేరి, అమ్మవారి విగ్రహం కూడా మునిగిన విషయం తెలిసిందే. దేవదాయశాఖ అధికారులు మంగళవారం ఆలయ రాజగోపుర తలుపులతోపాటు గర్భగుడి ముందుభాగం ప్రధాన ముఖద్వారం తలుపులు కూడా మూసివేసి భక్తులకు దర్శనాన్ని నిలిపివేశారు. వదరనీరు మంగళవారం సాయంత్రానికి తగ్గుముఖం పట్టింది. గర్భాలయంలో ఉన్న నీటిని తొలగించడంతో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీనివల్ల గురువారం కూడా దాదాపు మోకాటి లోతు నీరుంది. ఇప్పటికే సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నవారు దర్శ నం లేదనడంతో ఉస్సూరుమంటూ తిరుగుముఖం పడుతున్నారు. కాగా.. నీటిని తొలగించడం అటుంచి, హుండీలో నగదును తీసి లెక్కించే పనిలో అధికారులు నిమగ్నమవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.