జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌ 12 రాకెట్‌కు నేటినుంచి కౌంట్‌డౌన్‌

ABN , First Publish Date - 2023-05-28T01:54:57+05:30 IST

చెంగాళమ్మకు ఇస్రో చైర్మన్‌ పూజలు

  జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌ 12 రాకెట్‌కు నేటినుంచి కౌంట్‌డౌన్‌
ప్రయోగ వేదికపై జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌ 12 రాకెట్

సూళ్లూరుపేట, మే 27: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి సోమవారం ఉదయం 10.42 గంటలకు జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌ 12 రాకెట్‌ ప్రయోగం చేపట్టనున్నారు. ఈ రాకెట్‌ ద్వారా నావిగేషన్‌ వ్యవస్థకు చెందిన 2,232 కిలోల బరువు గల ఎన్‌వీఎ్‌స-01 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.ప్రయోగానికి సంబంధించిన మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ సమావేశం (ఎంఆర్‌ఆర్‌) శనివారం షార్‌లోని బ్రహ్మప్రకాష్‌ హాల్లో నిర్వహించారు. అనంతరం షార్‌ డైరెక్టర్‌ ఆర్ముగం రాజరాజన్‌ అధ్యక్షతన లాంచింగ్‌ ఆథరైజేషన్‌ బోర్డు (ల్యాబ్‌) ప్రతినిధులు సమావేశమై ప్రయోగానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ప్రయోగానికి 27.30 గంటల ముందు ఆదివారం ఉదయం 7.42 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించనున్నారు.కౌంట్‌డౌన్‌ తరువాత జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌ 12 రాకెట్‌ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది.19 నిమిషాల్లో ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చనుంది.

జూలైలో చంద్రయాన్‌-3 ప్రయోగం:సోమనాథ్‌

తెలుగు, తమిళ భక్తుల ఆరాధ్య దైవమైన చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని శనివారం ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌ 12 విజయవంతం కావాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్‌ దువ్వూరు బాలచంద్రా రెడ్డి, ఈవో ఆళ్ల శ్రీనివాస రెడ్డి ఇస్రో చైర్మన్‌ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి పూజలనంతరం తీర్ధప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్‌ విలేకర్లతో మాట్లాడుతూ చంద్రయాన్‌-3 ప్రయోగం జూలైలో ఉంటుందని స్పష్టం చేశారు. గగన్‌యాన్‌కు సంబంధించి కొన్ని కీలక పరీక్షలు జరగాల్సి ఉంది కాబట్టి ప్రయోగం ఏడాది చివర్లో వుండొచ్చన్నారు. చైర్మన్‌ వెంట షార్‌ గ్రూపు డైరెక్టర్‌ గోపీకృష్ణ తదితరులున్నారు.

Updated Date - 2023-05-28T02:01:20+05:30 IST

News Hub