Share News

రాత్రికి రాత్రే బస్సు షెల్టర్‌ కూల్చివేత

ABN , First Publish Date - 2023-10-21T02:02:26+05:30 IST

తెల్లారేసరికి బస్సు షెల్టర్‌ మాయమైంది. స్థలం చదును చేసేసి ఉంది. శాంతిపురంలో 20 ఏళ్ల కిందట నిర్మించిన బస్సు షెల్టర్‌ను కొందరు కూల్చేశారు. ఇది అధికార పార్టీ నేతల పనేనంటూ టీడీపీ నాయకులు శుక్రవారం బస్సు షెల్టర్‌ స్థలంలో నిరసనకు దిగారు.

రాత్రికి రాత్రే బస్సు షెల్టర్‌ కూల్చివేత
బస్సు షెల్టర్‌ కూల్చిన స్థలంలో నిరసన తెలుపుతున్న టీడీపీ నేతలు (ఇన్ సెట్లో)మండల సచివాలయం ఎదుట కూల్చేసిన బస్సు షెల్టర్‌

అధికార పార్టీ నేతల పనేనంటూ టీడీపీ నిరసన

బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు

శాంతిపురం, అక్టోబరు 20: తెల్లారేసరికి బస్సు షెల్టర్‌ మాయమైంది. స్థలం చదును చేసేసి ఉంది. శాంతిపురంలో 20 ఏళ్ల కిందట నిర్మించిన బస్సు షెల్టర్‌ను కొందరు కూల్చేశారు. ఇది అధికార పార్టీ నేతల పనేనంటూ టీడీపీ నాయకులు శుక్రవారం బస్సు షెల్టర్‌ స్థలంలో నిరసనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. ప్రజల సౌకర్యార్థం మండల సచివాలయం ఎదుట బస్సు షెల్టరు నిర్మించారు. దీనికి 2002-03లో అప్పటి ఎంపీ ఎన్‌.రామకృష్ణారెడ్డి తన నిధుల నుంచి రూ.3 లక్షలు మంజూరు కాలక్రమేణా ఇక్కడి భూముల విలువ పెరిగిది. కొంత మంది ఆ ప్రాతంలో స్థలాలు కొని విశాలమైన భవనాలు నిర్మించుకున్నారు. బస్సు షెల్టర్‌ వెనుక స్థలాన్ని అధికార పార్టీకి చెందిన ఓ నేత కొనుగోలు చేశారు. ఆ స్థలానికి మరింత విలువ పెరగాలంటే బస్సు షెల్టర్‌ అడ్డుగా ఉందని భావించి రాత్రికి రాత్రే కూల్చేయించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కుప్పం రూరల్‌ సీఐ ఈశ్వర్‌రెడ్డి, రాళ్లబూదుగూరు ఇన్‌చార్జి ఎస్‌ఐ లక్ష్మీకాంతరెడ్డి తమ సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిశీలించారు. మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి పీఎస్‌ మునిరత్నం, సమన్వయ కర్త చంద్రశేఖర్‌, ఇతర నేతలు బస్సు షెల్టర్‌ కూల్చిన ప్రాతంలో నిరసనకు దిగారు. వీరికి కాంగ్రెస్‌, వీసీకే పార్టీ నేతలు మద్దతు తెలిపారు. ప్రజలకు సౌకర్యంగా ఉన్న బస్సు షెల్టర్‌ను అధికార పార్టీ నేతలు తమ స్వార్థం కోసం కూల్చడం దారుణమన్నారు. స్వయాన ముఖ్యమంత్రే ప్రజావేదికను కూల్చి కక్ష సాధింపునకు పునాది వేశారని ఆరోపించారు. అదే స్ఫూర్తితో మొన్న దుకాణం.. నేడు బస్సు షెల్టర్‌ను ఇక్కడి నేతలు కూల్చారని మండిపడ్డారు. ఇవన్నీ మంత్రి పెద్దిరెడ్డికి, ఎంపీ, ఎమ్మెల్సీకి కనపడవా.. లేదా వారి మద్దతు ఉందా అని ప్రశ్నించారు. ‘ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని ధర్నా చేస్తామంటే ముందుగానే పోలీసులు కేసులు కడతామని హెచ్చరిస్తారు. అదే బస్సు షెల్టర్‌ కూల్చిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు’ అని నిలదీశారు. వారం రోజుల్లో షెల్టరును నిర్మించకుంటే తీవ్రస్థాయిలో ఉద్యమిస్థామని శ్రీనివాసులు హెచ్చరించారు. బస్సు షెల్టర్‌ కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు, తహసీల్దారు కౌలే్‌షకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ నిరసనలో టీడీపీ నేతలు విశ్వనాథ్‌నాయుడు, ఉదయకుమార్‌నాయుడు, విజయరామిరెడ్డి, నాగరాజు, చంద్రశేఖర్‌, మణి, ఏఎంసీ నాగరాజు, దాము, బసవరాజు, కుప్పం నేతలు సత్యేంద్రశేఖర్‌, శాంతరాం, ఆంజనేయరెడ్డి, మురళి, గోపాల్‌, వెంకటేష్‌, శకుంతల, శ్యామల, రూప, పౌలారాణి, యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు కేశవరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-21T02:02:26+05:30 IST