Share News

‘జగనన్న ఆరోగ్య సురక్ష’ లో జిల్లా ఫస్ట్‌: మంత్రి

ABN , Publish Date - Dec 18 , 2023 | 11:39 PM

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం మొదటి విడత అమలులో చిత్తూరు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

‘జగనన్న ఆరోగ్య సురక్ష’ లో  జిల్లా ఫస్ట్‌: మంత్రి
మెగా చెక్‌ను విడుదల చేస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

చిత్తూరు కలెక్టరేట్‌, డిసెంబరు 18: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం మొదటి విడత అమలులో చిత్తూరు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సోమవారం వెలగపూడి నుంచి సీఎం జగన్‌ వర్చువల్‌ విధానంలో ప్రారంభించిన మెగా ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమంలో చిత్తూరు కలెక్టరేట్‌ నుంచి పాల్గొన్న మంత్రి ఈ వివరాలు తెలిపారు. మెగా చెక్‌ను ఆవిష్కరించారు. జిల్లావ్యాప్తంగా 77 నెట్‌వర్క్‌ ఆస్పత్రులు పనిచేస్తుండగా, 4,73,877 ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేశామన్నారు. జగనన్న ఆరోగ్యసురక్ష రెండో విడత కార్యక్రమం 2024 జనవరి 2 నుంచి ప్రారంభమౌతుందని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చిత్తూరు కలెక్టరేట్‌లో జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్‌, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కలెక్టర్‌ షన్మోహన్‌, ఎస్పీ రిషాంత్‌ రెడ్డి, చిత్తూరు మేయర్‌ అముద, రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ కె.జె.శాంతి, డీఎంహెచ్‌వో ప్రభావతి, జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్‌ సుదర్శన్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 11:39 PM