ఏపీలో రెండు గొర్రె జాతులకు భౌగోళిక గుర్తింపు..!

ABN , First Publish Date - 2023-09-20T01:43:52+05:30 IST

కొత్తగా రెండు గొర్రెజాతులకు జాతీయస్థాయిలో భౌగోళిక గుర్తింపు దక్కడంలో ఎస్వీ వెటర్నరీవర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన మంచి ఫలితానిచ్చింది.

ఏపీలో రెండు గొర్రె జాతులకు భౌగోళిక గుర్తింపు..!
నాగావళిగా గుర్తింపు పొందిన నాటురకం జీవాలు

-ఉత్తరాంధ్రలో నాగావళి, పల్నాడులో మాచర్ల

-ఫలించిన వెటర్నరీ శాస్త్రవేత్తల పరిశోధన

తిరుపతి(విద్య),సెప్టెంబరు19:కొత్తగా రెండు గొర్రెజాతులకు జాతీయస్థాయిలో భౌగోళిక గుర్తింపు దక్కడంలో ఎస్వీ వెటర్నరీవర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన మంచి ఫలితానిచ్చింది.రాష్ట్రంలో నాటు గొర్రెలుగా పిలవబడే అనేక రకాల్లో ఎంతో జన్యువైవిధ్యం ఉన్నా ..దశాబ్దాల తరబడి ఇప్పటివరకు నెల్లూరుజాతి గొర్రెలకు మాత్రమే భౌగోళిక గుర్తింపు ఉంది. తాజాగా మరో రెండు గొర్రెజాతులకు నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ యానిమల్‌ జెనిటిక్‌ రిసోర్సె్‌స(ఎన్‌బీఏజీఆర్‌)సంస్థ అధికారిక గుర్తింపు లభించింది. వీటిలో ఒకటి ఉత్తరాంధ్ర ప్రాంతంలోని నాగావళి, రెండవది పల్నాడు ప్రాంతంలోని మాచర్ల గొర్రెజాతికి ఈ గుర్తింపు లభించింది. ఇప్పటివరకు నాటుగొర్రెలుగా పిలవబడుతున్న వీటిని ప్రత్యేకజాతిగా గుర్తించడం వల్ల గొర్రెల పెంపకందార్లకు అనేక లాభాలు చేకూరనున్నాయి. ఈ జ ాతి పరిరక్షణకు ప్రభుత్వ ప్రోత్సాహక నిధులతోపాటు వీటి మాంసానికి మార్కెట్‌లో అధికధర లభించే అవకాశం ఉంటుంది. వెటర్నరీ వర్సిటీ శాస్త్రవేత్తలు 15సంవత్సరాలుగా గొర్రెల బాహ్య, జన్యులక్షణాల నిర్ధారణ(జెనెటిక్‌ కేరక్టరైజేషన్‌), దాన్ని జనాభా స్థితిగతులపై శాస్ర్తీయంగా అధ్యయనం చేసి తగిన వివరాలను హర్యానా రాష్ట్రంలోని కర్నాల్‌లో ఉన్న జాతీయసంస్థ(ఎన్‌బీఏజీఆర్‌)కి నివేదించారు. దాంతో ఆ సంస్థ జూలై నెలలో వీటిని ప్రత్యేక జాతిగా గుర్తించిందని వర్సిటీ డీఆర్‌ డాక్టర్‌ కె.సర్జన్‌రావు పేర్కొన్నారు. కొత్తగా గొర్రెల ఫారాలు పెట్టదలచుకున్న ఔత్సాహికులకు ఈ జాతి జీవాల పెంపకం ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.తక్కువ మేపు వనరులతో, వర్షాభావపరిస్థితుల్లో వ్యాధులను తట్టుకుని పెరుగుతాయి కాబట్టి రైతులకు మంచి ఆదాయం చేకూరుతుందని,ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలు వంటివి తీసుకునేందుకు సౌలభ్యంగా ఉంటుందన్నారు.కాగా ఉత్తరాంధ్రలో నాగావళి గొర్రెజాతుల పెంపకదారుల వలస మార్గాలపై అప్పటి ప్రొఫెసర్‌ డాక్టర్‌ కె.సర్జన్‌రావు మార్గదర్శకంలో వెటర్నరీ శాస్త్రవేత్త డాక్టర్‌ ఆనందరావు విస్తృతంగా పరిశోధన చేశారు. డాక్టర్‌ గంగరాజు, డాక్టర్‌ సతీ్‌ష కూడా ఈ జాతి గొర్రెల అభివృద్ధిపై పరిశోఽఽధన చేశారు. అలాగే మాచర్ల గొర్రెజాతులపై వర్సిటీ జెనెటిక్స్‌ విభాగ శాస్త్రవేత్త డాక్టర్‌ పాండురంగారెడ్డి పరిశోధన చేశారు.

Updated Date - 2023-09-20T01:43:52+05:30 IST