వైభవంగా సంకటహర గణపతి వ్రతం
ABN , First Publish Date - 2023-05-09T00:50:27+05:30 IST
కాణిపాకంలో సోమవారం సంకటహర గణపతి వ్రతాన్ని భక్తులు వైభవంగా నిర్వహించారు. ఆలయ ఆస్థాన మండపంలో ఈ వ్రతాన్ని నిర్వహించారు.

స్వర్ణ రథంపై ఊరేగిన వినాయకుడు
ఐరాల(కాణిపాకం), మే 8: కాణిపాకంలో సోమవారం సంకటహర గణపతి వ్రతాన్ని భక్తులు వైభవంగా నిర్వహించారు. ఆలయ ఆస్థాన మండపంలో ఈ వ్రతాన్ని నిర్వహించారు. ఉదయం, సాయంత్రం రెండు దఫాలుగా జరిగిన ఈ వ్రతంలో వందలాదిగా భక్తులు పాల్గొన్నారు. పౌర్ణమి తర్వాత నాలుగో రోజున ఈ వ్రతాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఉదయం మూల విరాట్‌కు అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆస్థాన మండపంలో సిద్ధి, బుద్ధి సమేత వినాయక స్వామి ఉత్సవమూర్తులకు పూజలు చేశారు. సంకటహర గణపతి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాత్రి సిద్ధి, బుద్ధి సమేత వినాయక స్వామి ఉత్సవర్లను స్వర్ణ రథంపై ఉంచి మాడవీధులలో ఊరేగించారు. స్వర్ణ రథంపై స్వామిని దర్శించుకోవడానికి వందలాదిగా భక్తులు కాణిపాకం విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు, ఏఈవో రవీంద్రబాబు, సూపరింటెండెంట్లు శ్రీధర్‌బాబు, కోదండపాణి, ఆలయ ఇన్‌స్పెక్టర్లు బాలాజీ నాయుడు, బాబు తదితరులు పాల్గొన్నారు.