‘పట్టభద్రుల’ కేంద్రంలో రెండు ఓటింగ్‌ కంపార్టుమెంట్లు

ABN , First Publish Date - 2023-03-11T00:04:25+05:30 IST

ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పట్టభద్రుల పోలింగ్‌ కేంద్రంలోనూ రెండు ఓటింగ్‌ కంపార్టుమెంట్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌, ఆర్వో హరినారాయణన్‌ ఆదేశించారు

‘పట్టభద్రుల’ కేంద్రంలో   రెండు ఓటింగ్‌ కంపార్టుమెంట్లు
అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

కలెక్టర్‌ హరినారాయణన్‌

చిత్తూరు కలెక్టరేట్‌, మార్చి 10: ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పట్టభద్రుల పోలింగ్‌ కేంద్రంలోనూ రెండు ఓటింగ్‌ కంపార్టుమెంట్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌, ఆర్వో హరినారాయణన్‌ ఆదేశించారు. శుక్రవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నోడల్‌ అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో వీడియోగ్రఫీ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈనెల 12న నాలుగు రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలు కమ్‌ రిసెప్షన్‌ సెంటర్‌లో సిబ్బందికి అవసరమైన పోలింగ్‌ సామాగ్రిని చెక్‌లిస్టు ప్రకారం అందజేయాలన్నారు. జేసీ వెంకటేశ్వర్‌, డీఆర్వో రాజశేఖర్‌, నలుగురు ఆర్డీవోలు, నోడల్‌ ఆఫీసర్లు పాల్గొన్నారు.

కౌంటింగ్‌కు సిద్ధంకండి: జేసీ

పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఓట్ల కౌంటింగ్‌కు సిద్ధం కావాలని అధికారులకు జేసీ వెంకటేశ్వర్‌ సూచించారు. శుక్రవారం స్థానిక ఆర్వీఎస్‌ కాలేజ్‌ ఆడిటోరియంలో తిరుపతి, అన్నమయ్య కౌంటింగ్‌ అధికారులు, సిబ్బందికి నిర్వహించిన రెండో విడత శిక్షణ తరగతులను ఆయన పరిశీలించారు. ఈనెల 16న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థుల కౌంటింగ్‌ ఆర్వీఎస్‌ లా కాలేజ్‌లో, పట్టభద్రులకు ఆర్వీఎస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో కౌంటింగ్‌ జరుగుతుందని చెప్పారు. ఏఆర్వో, డీఆర్వో ఎస్‌.రాజశేఖర్‌ మాట్లాడుతూ.. నిరంతరాయంగా జరిగే కౌంటింగ్‌లో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. రిటైర్డ్‌ ఏజేసీ, మాస్టర్‌ ట్రైనర్‌ వి.ఆర్‌. చంద్రమౌళి కౌంటింగ్‌ సందర్భంగా సిబ్బందికి తలెత్తే సందేహాలను నివృత్తిచేశారు. తిరుపతి, అన్నమయ్య డీఆర్వోలు శ్రీనివాసరావు, సత్యనారాయణ, జడ్పీ సీఈవో ప్రభాకర్‌ రెడ్డి, ఆర్డీవోలు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-11T00:04:25+05:30 IST