మరిన్ని ప్రయోగాలకు ఇస్రో సన్నాహాలు

ABN , First Publish Date - 2023-01-14T00:22:14+05:30 IST

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ ఏడాది 10 నుంచి 15 ప్రయోగాలు షార్‌ నుంచి చేపట్టేందుకు సదుపాయాలు సమకూర్చుకుంటోంది.ఇందులో భాగంగా షార్‌లోని మొదటి లాంచింగ్‌ కాంప్లెక్స్‌లో పీఎస్‌ఎల్వీ ఇంటిగ్రేషన్‌ ఫెసిలిటి (పీఐఎఫ్‌) బిల్డింగ్‌ను అందుబాటులోకి తెచ్చారు.

మరిన్ని ప్రయోగాలకు ఇస్రో సన్నాహాలు
పీఐఎఫ్‌ కాంప్లెక్స్‌ వద్ద ట్రయల్‌ నిర్వహిస్తున్న శాస్త్రవేత్తలు

సూళ్లూరుపేట, జనవరి 13: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ ఏడాది 10 నుంచి 15 ప్రయోగాలు షార్‌ నుంచి చేపట్టేందుకు సదుపాయాలు సమకూర్చుకుంటోంది.ఇందులో భాగంగా షార్‌లోని మొదటి లాంచింగ్‌ కాంప్లెక్స్‌లో పీఎస్‌ఎల్వీ ఇంటిగ్రేషన్‌ ఫెసిలిటి (పీఐఎఫ్‌) బిల్డింగ్‌ను అందుబాటులోకి తెచ్చారు. శుక్రవారం ఇంటిగ్రేషన్‌ ఫెసిలిటి నుంచి డమ్మీ వాహక నౌకను లాంచ్‌ప్యాడ్‌ మొబైల్‌ సర్వీసు టవర్‌ వద్దకు ట్రయల్‌ రన్‌ను నిర్వహించారు.మరిన్ని ప్రయోగాలు చేపట్టేందుకు పీఎస్‌ఎల్వీ క్లాస్‌ వెహికల్స్‌కు అదనపు ఇంటిగ్రేషన్‌ సౌకర్యంగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ సదుపాయంలో లాంచ్‌ వెహికల్‌ అన్ని దశలను, ఉపగ్రహాలను ఇంటిగ్రేషన్‌ చేసి లాంచ్‌ప్యాడ్‌ వద్దకు తీసుకెళ్తారు. అంటే ప్రయోగ వేదికపై ఒక రాకెట్‌ను సిద్ధం చేస్తుండగా, ఈ ఫెసిలిటితో మరో ప్రయోగానికి సంబంధించిన రాకెట్‌ భాగాలను ఇంటిగ్రేషన్‌ చేయవచ్చు. మరిన్ని ప్రయోగాలు చేపట్టేందుకు వీలుంటుందని ఇస్రో ఇలాంటి సదుపాయాలను సమకూర్చుకుంటోంది. ఇప్పటికే షార్‌లో ఒక వెహికల్‌ అసెంబ్లీ బిల్డింగ్‌ (వ్యాబ్‌), రెండు ప్రయోగ వేదికలున్నాయి. అదనంగా పీఎస్‌ఎల్వీ ఇంటిగ్రేషన్‌ ఫెసిలిటి కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు.

Updated Date - 2023-01-14T00:22:15+05:30 IST