జగనన్న ఆరోగ్య సురక్ష ప్రారంభం
ABN , First Publish Date - 2023-10-01T01:53:23+05:30 IST
చిత్తూరు నగరం టెలిఫోన్ కాలనీలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో శనివారం జగనన్న ఆరోగ్య సురక్షను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మేయర్ అముద, కలెక్టర్ షన్మోహన్‌తో కలిసి జిల్లా ప్రత్యేకాధికారి వీరపాండ్యన్ ప్రారంభించారు.
చిత్తూరు, సెప్టెంబరు 30: చిత్తూరు నగరం టెలిఫోన్ కాలనీలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో శనివారం జగనన్న ఆరోగ్య సురక్షను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మేయర్ అముద, కలెక్టర్ షన్మోహన్‌తో కలిసి జిల్లా ప్రత్యేకాధికారి వీరపాండ్యన్ ప్రారంభించారు. ప్రజారోగ్యమే ఈ కార్యక్రమ లక్ష్యమని ఆయన తెలిపారు. జిల్లాలోని 478 శిబిరాల్లో 11 రకాల వ్యాధులకు డాక్టర్లు పరీక్షలు చేసి మందులను పంపిణీ చేస్తారని కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్యే, ఇతర ప్రజా ప్రతినిధులు బీపీ పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం వీరంతా స్టాళ్లను పరిశీలించారు. ఏయే కౌంటర్లలో ఎలాంటి వైద్య సేవలు అందుతున్నాయనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక డాక్టర్ జనార్దన్, డీఎంహెచ్‌వో ప్రభావతి, జిల్లా కో- ఆర్డినేటర్ డాక్టర్ జనార్దన్, జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి, కమిషనర్ అరుణ, డీఐవో రవిరాజు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.