Share News

సమ్మెబాట పట్టిన కేజీబీవీ ఉద్యోగులు

ABN , Publish Date - Dec 31 , 2023 | 12:33 AM

రెగ్యులర్‌తో పాటు ఎంటీఎస్‌ అమలు డిమాండ్‌ చేస్తూ కేజీబీవీలోని కాంట్రాక్టు టీచర్లు, ఉద్యోగులు సమ్మెబాట పట్టారు.

సమ్మెబాట పట్టిన కేజీబీవీ ఉద్యోగులు
సమ్మె నోటీసు ఇచ్చేందుకు డీఈవో కార్యాలయానికి వచ్చిన కేబీజీవీ ఉద్యోగులు

చిత్తూరు (సెంట్రల్‌), డిసెంబరు 30: రెగ్యులర్‌తో పాటు ఎంటీఎస్‌ అమలు డిమాండ్‌ చేస్తూ కేజీబీవీలోని కాంట్రాక్టు టీచర్లు, ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. శనివారం వారు డీఈవో కార్యాలయంలో డీఈవో విజయేంద్రరావును కలిసి సమ్మె నోటీసు ఇచ్చారు. మహిళా ఉద్యోగులు మాట్లాడుతూ ఏళ్ల తరబడి పని చేస్తున్నా తమ ఉద్యోగాలకు గ్యారెంటీ లేకపోవడం బాధాకరమన్నారు. తక్కువ జీతాలతో ఎక్కువ పని చేస్తున్నామని, ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ప్రయోజనాలు లేకపోవడం సరికాదన్నారు. రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా తమకు రావాల్సిన హక్కులను కల్పించాలని కోరారు. ఉద్యోగ భద్రత, డీఏ, మెడికల్‌, సెలవులు, గ్రాట్యుటీ వంటి సౌకర్యాలతో పాటు ప్రతి నెలా ఒకటవ తేదీనే జీతాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమ్మె నోటీసు ఇచ్చిన వారిలో సమగ్రశిక్ష ఉద్యోగుల జేఏసీ నాయకులు విల్వనాధం, శరత్‌బాబు, జయమాధురి, నాగమణి, తాజ్‌, ఝాన్సీరాణి, లలిత, నిర్మల, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2023 | 12:33 AM