పురుషుల వాలీబాల్ విజేత చెన్నై
ABN , First Publish Date - 2023-01-23T00:10:28+05:30 IST
బంగారుపాళ్యంలోని క్రీడా మైదానంలో ఆదివారం రాత్రి ఫ్లడ్ లైట్ల వెలుతురులో వాలీబాల్ పోటీలు హోరాహోరీగా సాగాయి. పురుషుల విభాగంలో చెన్నై, మహిళల విభాగంలో కేరళ పోలీసు జట్లు విజేతగా నిలిచాయి.
మహిళల విభాగంలో కేరళ పోలీసు జట్టు
బంగారుపాళ్యం, జనవరి 22: బంగారుపాళ్యంలోని క్రీడా మైదానంలో ఆదివారం రాత్రి ఫ్లడ్ లైట్ల వెలుతురులో వాలీబాల్ పోటీలు హోరాహోరీగా సాగాయి. పురుషుల విభాగంలో చెన్నై, మహిళల విభాగంలో కేరళ పోలీసు జట్లు విజేతగా నిలిచాయి.
మహిళా విభాగం: కేరళ పోలీసు జట్టు, ఎస్ఆర్ఎం చెన్నై జట్ల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో కేరళ మహిళా పోలీసు జట్టు మొదటి స్థానం సాధించి కప్పు కైవసం చేసుకుంది. రెండో స్థానం ఎస్ఆర్ఎం చెన్నైజట్టు కైవసం చేసుకుంది. మూడో స్థానంలో భారతియార్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ (సేలం), నాలుగో స్థానంలో టి.కె.ఆర్. ఈరోడ్డు జట్టు నిలిచాయి. ప్రథమ స్థానంలో నిలిచిన జట్టుకు రూ.40వేలు, రెండో స్థానం రూ.30వేలు, మూడో స్థానం రూ.20వేలు, నాలుగో స్థానం రూ.10వేలు చొప్పున నగదు బహుమతులు అందించారు.
పురుషుల విభాగం: మొదటి స్థానానికి జరిగిన పోటీల్లో బెంగళూరు, తమిళనాడు పోలీసు జట్లు తలపడ్డాయి. ఈ పోటీలో తమిళనాడు పోలీసు జట్టు మొదటిస్థానంలో నిలిచి కప్‌ను కైవసం చేసుకుంది. రెండో స్థానంలో ఎస్ఆర్ఎం చెన్నై, మూడో స్థానంలో మద్రాసు యూనివర్సిటీ, నాలుగో స్థానంలో కర్ణాటక జట్లు నిలిచాయి. విజేత జట్లకు మొదటిస్థానం రూ.40వేలు, రెండో స్థానం రూ.30వేలు, మూడో స్థానం రూ.20వేలు, నాలుగో స్థానం రూ.10వేలు చొప్పున నగదు బహుమతులు అందజేశారు. వీరికి చిత్తూరు ఎపీఈ రెడ్డప్ప, జడ్పీ మాజీ చైర్మన్ కుమార్‌రాజా చేతులమీదుగా నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచి ఉమాదేవి క్రిష్ణమూర్తి, ఉపసర్పంచ్ కామరాజు, చెన్నై బ్రిడ్జి టెక్నికల్ ఆఫీసర్ తులసీరెడ్డి, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కోశాధికారి మురారి, మాజీ వాలీబాల్ కోచ్ సుదర్శన్ నాయుడు, మాజీ వాలీబాల్ క్రీడాకారులు ప్రతా్పసేన్, మస్తాన్, దిలీప్, చందు, మురుగేష్, పెరుమాళ్ తదితరులు పాల్గొన్నారు.