భక్తులతో ముక్కంటి ఆలయం కిటకిట

ABN , First Publish Date - 2023-09-04T01:56:17+05:30 IST

శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వారంతపు సెలవులు కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.

భక్తులతో ముక్కంటి ఆలయం కిటకిట
ఆలయం వద్ద భక్తుల సందడి

శ్రీకాళహస్తి, సెప్టెంబరు 3: శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వారంతపు సెలవులు కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. సుమారు 26వేలమంది దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రూ.200 శీఘ్ర దర్శనం టిక్కెట్ల ద్వారా 469మంది, రూ.50ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా 1,169మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక రూ.500 రాహుకేతు టిక్కెట్ల ద్వారా 2,244మంది, రూ.750 టిక్కెట్ల ద్వారా 1,030, రూ.1,500 టిక్కెట్ల ద్వారా 210మంది, రూ.2,500 టిక్కెట్ల ద్వారా 211మంది, రూ.5వేల టిక్కెట్ల ద్వారా 47మంది పూజలు చేయించుకున్నారు. ఐదు రకాల ప్రసాదాలు కలిపి 20,460 అమ్ముడైనట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Updated Date - 2023-09-04T01:56:17+05:30 IST