పండ్లు, పుష్పాలంకరణలతో ముక్కంటి ఆలయం

ABN , First Publish Date - 2023-02-18T01:47:56+05:30 IST

మహాశివరాత్రి పర్వదినం రోజున భక్తులను ఆకట్టుకునేలా ముక్కంటి ఆలయంలో పండ్లు, పండ్లు, పుష్పాల అలంకరణలు శుక్రవారం చేపట్టారు.

పండ్లు, పుష్పాలంకరణలతో ముక్కంటి ఆలయం

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 17: మహాశివరాత్రి పర్వదినం రోజున భక్తులను ఆకట్టుకునేలా ముక్కంటి ఆలయంలో పండ్లు, పండ్లు, పుష్పాల అలంకరణలు శుక్రవారం చేపట్టారు. ఆలయంలోని స్వామి అమ్మవార్ల సన్నిధిలో పాటు గురు దక్షిణామూర్తి సన్నిధిలో విశేషంగా వివిధ పూలు, పండ్ల ప్రత్యేక అలంకరణలు చేపట్టారు. భక్తులు వీటిని చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మైమరిపిస్తున్న లేజర్‌షో

శ్రీకాళహస్తిలో లేజర్‌షో భక్తులను మైమరిపిస్తోంది. స్వర్ణముఖి నది అవతలి వైపు నుంచి నదీ జలాలతో పాటు ముక్కంటి ఆలయం, అక్కడే ఉన్న భక్తకన్నప్ప కొండపైకి రంగురంగుల లేజర్‌లైట్లతో ప్రత్యేక షోను ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ యేడాది ప్రత్యేకంగా లేజర్‌షోను ప్రారంభించారు. ఇవి భక్తులను ఆకట్టుకుంటున్నాయి.

Updated Date - 2023-02-18T01:47:57+05:30 IST