Share News

రూ. 50 లక్షల ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం

ABN , First Publish Date - 2023-12-13T01:16:02+05:30 IST

దీపం ఉండగానే ఇల్లు సర్దుకో అన్నవిధంగా తయారవుతున్నారు పలమనేరులోని కొందరు అఽధికారపార్టీ నేతలు. గంటావూరు సమీపంలోని బీసీ కాలనీ వద్ద ఉన్న గుట్టను చదును చేసి.. కబ్జా చేయడానికి స్కెచ్‌ వేశారు.

రూ. 50 లక్షల ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం
కబ్జాను అడ్డుకొన్న టీడీపీ నాయకులు

అడ్డుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు

పలమనేరు, డిసెంబరు 12: దీపం ఉండగానే ఇల్లు సర్దుకో అన్నవిధంగా తయారవుతున్నారు పలమనేరులోని కొందరు అఽధికారపార్టీ నేతలు. గంటావూరు సమీపంలోని బీసీ కాలనీ వద్ద ఉన్న గుట్టను చదును చేసి.. కబ్జా చేయడానికి స్కెచ్‌ వేశారు. ఈ గుట్టను తవ్వేందుకు మంగళవారం భారీ యంత్రం తీసుకొచ్చారు. రాళ్లను తరలించేందుకు ట్రాక్టర్లనూ సిద్ధం చేశారు. ఈ స్థలం విలువ రూ.50 లక్షలకుపైగా ఉంటుంది. ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తున్న ఆ పార్టీ నాయకులు దీనిని గుర్తించి.. ఈ భూకబ్జాను అడ్డుకొన్నారు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రెవెన్యూ అధికారులు పనులను నిలిపేశారు. ఈ భూకబ్జాకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు డిమాండు చేస్తున్నారు. లేని పక్షంలో ఈ భూకబ్జాలో రెవెన్యూ అధికారుల ప్రమేయం ఉందని భావించాల్సి వస్తుందన్నారు. అధికారులు గతంలోలాగే మళ్లీ అధికార పార్టీ కబ్జాదారులపక్షాన నిలిస్తే తాము ఆర్డీవో కార్యాలయం ముందు ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. కాగా, ఏడాది కిందట కూడా ఈ కాలనీలో గుట్టలు గుట్టలుగా ఉన్న దాదాపు రెండు ఎకరాలకు పైగా స్థలాన్ని అధికార పార్టీనేతలు ఇష్టారాజ్యంగా చదును చేసి అమ్మకాలు చేసేసుకొన్నారు. ఇందులో రెవెన్యూ అధికారులు కూడా పాలుపంచుకొన్నట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. తాజా ప్రయత్నాన్ని టీడీపీ నేతలు అడ్డుకున్నారు.

Updated Date - 2023-12-13T01:16:03+05:30 IST