కాణిపాకంలో సంకటహర గణపతి వ్రతం
ABN , First Publish Date - 2023-07-07T00:44:27+05:30 IST
కాణిపాకంలో సంకటహర గణపతి వ్రతాన్ని గురువారం భక్తులు వైభవోపేతంగా నిర్వహించారు.
స్వర్ణరథంపై విహరించిన వరసిద్ధుడు
ఐరాల (కాణిపాకం), జూలై 6: కాణిపాకంలో సంకటహర గణపతి వ్రతాన్ని గురువారం భక్తులు వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయంలోని ఆస్థాన మండపంలో సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామిని కొలువుదీర్చి అర్చకులు విశేషపూజలు చేశారు. అనంతరం భక్తుల ఆధ్వర్యంలో అర్చక పండితులు సంకటహర గణపతి వ్రతాన్ని నిర్వహింపజేశారు. ప్రతినెలా పౌర్ణమి గడిచిన నాలుగు రోజులుకు ఈ వ్రతాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. రాత్రి సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధుడి ఉత్సవ విగ్రహాలను అలంకారమండపం నుంచి అంగరంగ తీసుకొచ్చి స్వామి స్వర్ణరథంపై ఆశీనులను చేసి ఆలయ మాడ వీధుల్లో ఘనంగా ఊరేగించారు. ఈ సందర్భంగా కాణిపాక క్షేత్రం వినాయక నామస్మరణతో మార్మోగిపోయింది. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేశు, సర్పంచ్ శాంతిసాగర్ రెడ్డి, గణేష్ ప్రసాద్ రెడ్డి, ఏఈవో రవీంద్ర బాబు, సూపరింటెండెంట్ రంగస్వామి, ఆలయ ఇన్‌స్పెక్టర్ సురేశ్, భక్తులు పాల్గొన్నారు.