Chittoor: ద్రావిడ వర్సిటీ వీసీకి షోకాజ్ నోటీసు
ABN , First Publish Date - 2023-08-23T08:26:12+05:30 IST
చిత్తూరు జిల్లా: కుప్పం నియోజకవర్గం గుడుపల్లి మండలంలో ఉన్న ద్రావిడ యూనివర్సిటీ వీసీకి షోకాజ్ నోటీసు జారీ చేశారు. పీహెచ్డీ, డిగ్రీలు ఇవ్వడంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు నోటీసు ఇచ్చారు.
చిత్తూరు జిల్లా: కుప్పం నియోజకవర్గం గుడుపల్లి మండలంలో ఉన్న ద్రావిడ యూనివర్సిటీ (Dravida University) వీసీ (VC)కి షోకాజ్ నోటీసు (Show Cause Notice) జారీ చేశారు. పీహెచ్డీ, డిగ్రీలు ఇవ్వడంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు నోటీసు ఇచ్చారు. గుడుపల్లి మండలంలోని ద్రావిడ వర్సిటీలో.. పీజీ, ఎంఫిల్, డిగ్రీ సర్టిఫికెట్లు ఇవ్వడంలో నిబంధనలు ఉల్లంఘించారు. ప్రస్తుత వీసీ తుమ్మల రామకృష్ణ, మాజీ వీసీ సత్యనారాయణకు గవర్నర్ తరుపున, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ తరుపున అధికారులు నోటీసు జారీ చేశారు.
ద్రావిడ వర్సిటీలో ఎంఫిల్, పీహెచ్డీ ప్రదానంపై.. యూజీసీ నిబంధనలు పాటించడం లేదని గుర్తించారు. దీనిపై విచారణకు రిటైర్డ్ డా. జస్టిస్ బి.శేషశయనరెడ్డిని ప్రభుత్వం నియమించింది. విచారణ జరిపిన ఆయన నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. కొన్ని అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుత వీసీ తుమ్మల రామకృష్ణ, మాజీ వీసీ సత్యనారాయణ, వైస్-ఛాన్సలర్లపై చర్యలు ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నిస్తూ ఈ మేరకు నోటీసు జారీ చేశారు.