చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు
ABN , First Publish Date - 2023-09-18T01:38:20+05:30 IST
చిత్తూరులోని సీఎ్‌సఐ టౌన్ చర్చిలో ఆదివారం టీడీపీ నేతలు, కార్యకర్తలు కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
చిత్తూరు సిటీ, సెప్టెంబరు 17: చిత్తూరులోని సీఎ్‌సఐ టౌన్ చర్చిలో ఆదివారం టీడీపీ నేతలు, కార్యకర్తలు కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చంద్రబాబు ఆరోగ్యం బాగుండాలని, అక్రమ కేసుల నుంచి త్వరగా బయట పడాలని ప్రార్థనలు చేశారు. మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, నేతలు కటారి హేమలత, కాజూరు బాలాజి, కోదండయాదవ్, మోహన్‌రాజ్, సుబ్రి తదితరులు పాల్గొన్నారు.