‘గడప గడప’లో టీడీపీ జెండాలు కట్టి..!

ABN , First Publish Date - 2023-06-02T01:57:08+05:30 IST

బంగారుపాళ్యం మండలం 170 గొల్లపల్లె పంచాయతీ పరిధిలోని జయరామపురం, యర్రాండ్లపల్లె, 170 గొల్లపల్లెలో గురువారం ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు.

‘గడప గడప’లో టీడీపీ జెండాలు కట్టి..!
గొల్లపల్లెలో విద్యుత్‌ స్తంభాలకు కట్టిన టీడీపీ జెండాలు

బంగారుపాళ్యం, జూన్‌ 1: బంగారుపాళ్యం మండలం 170 గొల్లపల్లె పంచాయతీ పరిధిలోని జయరామపురం, యర్రాండ్లపల్లె, 170 గొల్లపల్లెలో గురువారం ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 170 గొల్లపల్లెలో కొందరు ఇళ్ల వద్ద, కరెంటు స్తంభాలకు టీడీపీ జెండాలను కట్టారు. ఈ గ్రామంతో పాటు యర్రాండ్లపల్లెలోనూ కొందరు ఇళ్లకు తాళమేసి బహిష్కరించారు. మరికొందరు ఇళ్ల వద్ద ఉండగా ఎమ్మెల్యే వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వారికి వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఇలా స్థానిక సర్పంచ్‌ కోకా ప్రకా్‌షనాయుడు ఇంటి వద్దకు వెళ్లగా గేటుకు తాళం వేసి ఉంది. అక్కడ నుంచే ఆయన సర్పంచికి ఫోన్‌ చేయగా స్పందించలేదు. కాగా, 170 గొల్లపల్లెలో వైసీపీ జెండాను ఎగురవేశారు. ఆయా కార్యక్రమాల్లో కన్వీనర్‌ రామచంద్రారెడ్డి, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ సోమశేఖర్‌, వైస్‌ ఎంపీపీ శిరీ్‌షరెడ్డి, నాయకులు లోకేష్‌, కిశోర్‌కుమార్‌రెడ్డి, దొరస్వామి, తహసీల్దార్‌ బెన్నిరాజ్‌, ఎంపీడీవో హరిప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-02T01:57:08+05:30 IST