LaxmiParvathi: ‘తెలుగు అకాడమీని చంద్రబాబు పట్టించుకోలేదు’

ABN , First Publish Date - 2023-04-11T12:20:05+05:30 IST

రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగు అకాడమీ, తెలుగు యునివర్సిటీలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదని తెలుగు సంస్కృతం అకాడమీ చైర్ పర్సన్‌ నందమూరి లక్ష్మీ పార్వతి విమర్శించారు.

LaxmiParvathi: ‘తెలుగు అకాడమీని చంద్రబాబు పట్టించుకోలేదు’

తిరుపతి: రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగు అకాడమీ, తెలుగు యునివర్సిటీలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) పట్టించుకోలేదని తెలుగు సంస్కృతం అకాడమీ చైర్ పర్సన్‌ నందమూరి లక్ష్మీ పార్వతి (Telugu Sanskrit Academy Chairperson Nandamuri Lakshmi Parvathi ) విమర్శించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి రాష్ట్రంలో సంస్కృత అకాడమీ ఉండటంతో ఏపీలో తెలుగు సంస్కృత అకాడమీ ఏర్పాటు చేశామన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి (AP CM Jaganmohan Reddy) చొరవతో 2019లో తెలుగు, సంస్కృత అకాడమి తిరుపతి కేంద్రంగా 2022లో ఏర్పడిందని చెప్పారు. జాతీయ సంస్కృత యూనివర్సిటీతో కలిసి పనిచేస్తామన్నారు. తెలుగు అకాడమీ ద్వారా ఇప్పటివరకు ఇంటర్మీడియట్ పుస్తకాలు ముద్రించామని, ఉన్నత విద్యా శాఖతో ఎం.వో.యు కుదుర్చుకుని డిగ్రీ పుస్తకాలు కూడా ముద్రణ చేస్తామని తెలిపారు.

పోటీ పరీక్షలకు అవసరమయ్యే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ ఎకానమీ మొదలైన 17 రకాల పుస్తకాలను ముద్రించ బోతున్నట్లు ప్రకటించారు. ఈ నెలలో ఉగాది పురస్కారాలు అందజేస్తామని అన్నారు. ఎన్.ఆర్.ఐ లు, వివిధ రాష్ట్రాల్లో ఉండే తెలుగు వాళ్ళు అందరికీ తెలుగు బాష అర్థం అయ్యేలా లెర్న్ తెలుగు ప్రవేశపెడతామని, వెబ్ సైట్స్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తెలుగు అకాడమీ పేరుతో నకిలీ వెబ్ సైట్ రూపొందిచారని... దీనిపై విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. 90 కోట్లు నిధులు రావాల్సి ఉందని, విలువైన ఆస్తులు ఉన్నాయని.. వీటిపై తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. దీనిపై హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నామని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.

Updated Date - 2023-04-11T12:20:05+05:30 IST