టిప్పర్‌ను ఢీకొన్న బైక్
ABN , First Publish Date - 2023-02-06T01:43:23+05:30 IST
టిప్పర్‌ను ఓ బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది
పెళ్లకూరు, ఫిబ్రవరి 5: టిప్పర్‌ను ఓ బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రొద్దుటూరుకు చెందిన హర్షవర్ధన్‌రెడ్డి(28), పుత్తూరు సమీపంలోని పాలమంగళంకు చెందిన ధర్యయ్య(30), పుంగనూరుకు చెందిన అజయ్ ఆదివారం రాత్రి నాయుడుపేట నుంచి శ్రీకాళహస్తి వైపునకు బైక్‌పై వస్తున్నారు. నాయుడుపేట- పూతలపట్టు జాతీయ రహదారిపై టెంకాయతోపు వద్దకొచ్చేసరికి ముందు వెళ్తున్న టిప్పర్‌ను వెనుక నుంచి ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో హర్షవర్ధన్‌రెడ్డి, ధర్మయ్య అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ శ్రీకాంత్ తన సిబ్బందితో వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన అజయ్‌ను 108 వాహనంలో తొలుత శ్రీకాళహస్తి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.