లోకం మెచ్చిన ప్రజాకవి వేమన
ABN , First Publish Date - 2023-01-19T23:59:49+05:30 IST
లోకం మెచ్చిన ప్రజా కవి వేమన అని ద్రావిడ విశ్వ విద్యాలయ రెక్టార్ ఆచార్య టి.అనురాధ కీర్తించారు.
గుడుపల్లె, జనవరి 19: లోకం మెచ్చిన ప్రజా కవి వేమన అని ద్రావిడ విశ్వ విద్యాలయ రెక్టార్ ఆచార్య టి.అనురాధ కీర్తించారు. ద్రావిడ వర్సిటీలో వేమన జయంతిని గురువారం నిర్వహించారు. వేమన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేమన పద్యాలు నిత్య సత్యాలని పేర్కొన్నారు. పాశ్చాత్య ధోరణిలో పడి చిన్న పిల్లలకు పద్యాలు నేర్పలేక పోతున్నామని విచారం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు వేమన పద్యాలను నేర్పించే ప్రయత్నం చేయాలన్నారు. రిజిస్ర్టార్ డాక్టర్ ఆకేపాటి వేణు గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. అందరి నోట నిత్యం అలరారే పద్యాలు వేమన పద్యా లన్నారు. వేమన సంఘ సంస్కర్తగా, మత విశ్వాసాలను, కుట్రలను, కుతం త్రాలను, రూపు మాపడానికి తన పద్యాలతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని వివరించారు. సమాజాన్ని సామాజిక వైజ్ఞానిక నేత్రాలతో దర్శించి కవిత్వం రాశార న్నారు. ఆడంబరంలేని అందమైన తెలుగు భాషకి వేమన గొప్ప కొరముట్టుగా పేర్కొన్నారు. అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.