Vijayendra Saraswati : శ్రీవారి సేవలో విజయేంద్ర సరస్వతి

ABN , First Publish Date - 2023-05-24T04:25:09+05:30 IST

కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి మంగళవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

Vijayendra Saraswati : శ్రీవారి సేవలో విజయేంద్ర సరస్వతి

తిరుమల, మే 23 (ఆంధ్రజ్యోతి): కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి మంగళవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, ఇతర అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

కెమెరాతో ఆలయంలోకి విజయేంద్ర శిష్యుడు

విజయేంద్ర సరస్వతి శ్రీవారి దర్శనార్థం ఆలయంలోకి వెళ్లే ముందే ఆయన వ్యక్తిగత ఫొటోగ్రాఫర్‌ కెమెరాతో మహద్వారం గేటు దాటి లోపలికి వెళ్లారు. కొద్ది సెకన్లలోనే అక్కడి సిబ్బంది గుర్తించి అతన్ని బయటకు పంపారు. అయితే ఫొటోగ్రాఫర్‌ గేటు దాటేదాకా భద్రతా సిబ్బంది పట్టించుకోకపోవడంపై విమర్శలు వచ్చాయి.

Updated Date - 2023-05-24T05:29:54+05:30 IST