CID Notices: మాజీమంత్రి నారాయణ కుమార్తె, అల్లుడికి సీఐడీ నోటీసులు
ABN , First Publish Date - 2023-03-06T21:26:28+05:30 IST
అమరావతి (Amaravati) రింగ్‌రోడ్డు కేసుపై సోమవారం సీఐడీ అధికారులు మాజీ మంత్రి పొంగూరు నారాయణ (Narayana), ఆయన సతీమణి రమాదేవి, కుమార్తె షరణి, ఉద్యోగి ప్రమీళలను విచారించారు.
నెల్లూరు: అమరావతి (Amaravati) రింగ్‌రోడ్డు కేసుపై సోమవారం సీఐడీ అధికారులు మాజీ మంత్రి పొంగూరు నారాయణ (Narayana), ఆయన సతీమణి రమాదేవి, కుమార్తె షరణి, ఉద్యోగి ప్రమీళలను విచారించారు. రింగ్‌రోడ్డు నిర్మాణంలో భాగంగా అప్పటి మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఆయన కుటుంబ సభ్యులు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారనే అభియోగాలపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ 16పై సోమవారం సీఐడీ అధికారులు నారాయణతోపాటు ఆయన కుటుంబ సభ్యులను విచారించారు. నారాయణ, ఆయన సతీమణి రమాదేవిని హైదరాబాద్‌లోని నారాయణ నివాసంలో విచారించగా, ఆయన రెండవ కుమార్తె షరణి, నారాయణ సంస్థల్లో పనిచేసే ఉద్యోగిని ప్రమీళను షరణి నివాసంలో విచారించి వాగ్మూలం రికార్డు చేసుకున్నారు. మధ్యాహ్నం నుంచి సాయత్రం 7.30 గంటల వరకు ఈ విచారణ సాగింది. ఈ కేసుపై నారాయణ పెద్ద కుమార్తె, పెద్ద అల్లుడిని కూడా విచారించనున్నారు. ఈనెల 20వ తేదిన విచారణకు అందుబాటులో ఉండాలని నారాయణ పెద్ద కుమార్తె సింధూర, ఆమె భర్త పునిత్‌కు సీఐడీ నోటీసులు (CID Notices) అందజేసింది.