Share News

Deputy CM : డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై ఫిర్యాదు

ABN , First Publish Date - 2023-10-17T13:06:32+05:30 IST

డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై ఎస్ఆర్ పురం పోలీస్ స్టేషన్‌లో టీడీపీ శ్రేణులు కంప్లైంట్ ఇచ్చాయి. నారా, నందమూరి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నారాయణస్వామిని అరెస్ట్ చేయాలని కోరారు.

Deputy CM : డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై ఫిర్యాదు

చిత్తూరు : డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై ఎస్ఆర్ పురం పోలీస్ స్టేషన్‌లో టీడీపీ శ్రేణులు కంప్లైంట్ ఇచ్చాయి. నారా, నందమూరి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నారాయణస్వామిని అరెస్ట్ చేయాలని కోరారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ థామస్ ఈ ఫిర్యాదు చేయడం జరిగింది. ‘ఎన్టీఆర్ బొమ్మని పెట్టుకొని ఎలక్షన్స్‌కి వస్తున్నారు అంటున్నావ్. నువ్వు వైయస్సార్ బొమ్మ లేకుండా స్వతంత్రం అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమా? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి నేను సిద్ధం.. నువ్వు మగాడివైతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చెయ్యి’ అని థామస్ సవాల్ విసిరారు.

Updated Date - 2023-10-17T13:06:32+05:30 IST