Ramakrishna: ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలు జగన్ సర్కార్ తుంగలో తొక్కింది
ABN , First Publish Date - 2023-06-15T12:40:57+05:30 IST
కేంద్ర ప్రభుత్వ విద్యుత్ ప్రైవేటీకరణలో భాగంగా వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లను బిగించే విధానాన్ని విరమించుకోవాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు.
విజయవాడ: కేంద్ర ప్రభుత్వ విద్యుత్ ప్రైవేటీకరణలో భాగంగా వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లను బిగించే విధానాన్ని విరమించుకోవాలని సీపీఐ నేత రామకృష్ణ (CPI Leader Ramakrishna) డిమాండ్ చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు, ట్రూ అప్ చార్జీలు, స్మార్ట్ మీటర్లు ఏర్పాటులను వ్యతిరేకిస్తూ ఆల్ పార్టీ లీడర్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో వాగ్దానాలను తుంగలో తొక్కి విద్యుత్ ఛార్జింగ్ పెంచుతూ ప్రజలపై పెను భారం మోపుతోందని మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వస్తే 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వడంతో పాటు రానున్న కాలంలో కరెంటు పెంచుమని నమ్మబలికారన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడుసార్లు కరెంటు చార్జీలను పెంచిందని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణం ట్రూ ఆప్ చార్జీలు, సబ్ చార్జీలు, సర్దుబాటు చార్జీలు రద్దుచేసి, ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించడానికి విరమించుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తు కార్యాచరణపై ఆల్ పార్టీ లీడర్స్ నిర్ణయం తీసుకుంటామని రామకృష్ణ పేర్కొన్నారు.