Ramakrishna: జగన్ సీఎం అయింది వాళ్లకు ప్రయోజనం చేకూర్చడానికేనా?... సీపీఐ నేత ఫైర్

ABN , First Publish Date - 2023-05-20T16:25:03+05:30 IST

ఏపీలో స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం మోపుతున్నారని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది కార్పోరేట్లకు, బడా పారిశ్రామిక వేత్తలకు ప్రయోజనం చేకూర్చడానికేనా అని ప్రశ్నించారు.

Ramakrishna: జగన్ సీఎం అయింది వాళ్లకు ప్రయోజనం చేకూర్చడానికేనా?... సీపీఐ నేత ఫైర్

అమరావతి: ఏపీలో స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం మోపుతున్నారని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది కార్పోరేట్లకు, బడా పారిశ్రామిక వేత్తలకు ప్రయోజనం చేకూర్చడానికేనా అని ప్రశ్నించారు. అదానీకి, తమ కడప మిత్రులకు ప్రయోజనం చేకూర్చేందుకు అవసరం లేకున్నా స్మార్ట్ మీటర్లు ప్రజల నెత్తిపై రుద్దడానికి సిద్ధపడుతున్నారని మండిపడ్డారు. 23 నుండి 26 తేదీల్లో జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో స్మార్ట్ మీటర్ల అంశంపై చర్చించి, రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కలసి వచ్చే పార్టీలతో కలసి దీనిపై ఉద్యమం చేపడతామన్నారు. ముఖ్యమంత్రి ఇళ్లు కట్టుకోవడానికి ఎకరాల భూమి కావాలి కానీ.. పేదలకు మాత్రం సెంట్ భూమి ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఆర్-3 జోన్‌లో 3 సెంట్ల భూమి ఇచ్చి ఇళ్లు కట్టి ఇవ్వాలని.. అమరావతిని రాజధానిగా ప్రకటించి ఇక్కడే పేదలకు ఇళ్లు కట్టించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

Updated Date - 2023-05-20T16:25:52+05:30 IST