Ramakrishna: అసైన్డ్ భూములు పేదలకే దక్కాలి

ABN , First Publish Date - 2023-07-31T09:36:45+05:30 IST

అసైన్డ్ భూములు పేదలకే దక్కేలా చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు.

Ramakrishna: అసైన్డ్ భూములు పేదలకే దక్కాలి

అమరావతి: అసైన్డ్ భూములు పేదలకే దక్కేలా చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ(CPI Leader Ramakrishna) డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రామకృష్ణ లేఖ రాశారు. 20 ఏళ్లు పైబడిన అసైన్డ్ భూములకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయనున్నట్లు తెలుస్తోందన్నారు. ఈ అసైన్ చట్ట సవరణ ద్వారా వైసీపీ నేతలు, రియల్టర్లు, భూస్వాములు లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే పరాధీనంలో ఉన్న లక్షలాది ఎకరాలను గుర్తించి, నిజమైన పేద లబ్ధిదారులకే అప్పగించేలా చర్యలు చేపట్టాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2023-07-31T09:49:12+05:30 IST