CPI Ramakrishna: విశాఖ ఉక్కు పరిశ్రమపై జగన్‌కు రామకృష్ణ లేఖ

ABN , First Publish Date - 2023-10-05T09:50:29+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. ఈనెల 6న ఢిల్లీ పర్యటన సందర్భంగా విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకై ప్రధానమంత్రితో చర్చించాలని అన్నారు.

CPI Ramakrishna: విశాఖ ఉక్కు పరిశ్రమపై జగన్‌కు రామకృష్ణ లేఖ

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి (CM Jaganmohan reddy) సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ (CPI Leader Ramakrishna) లేఖ రాశారు. ఈనెల 6న ఢిల్లీ పర్యటన సందర్భంగా విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకై ( Visakha Steel Industry) ప్రధానమంత్రితో చర్చించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అన్ని రకాలుగా నిర్వీర్యం చేసి ప్రైవేటీకరణ చేసేందుకు కుయుక్తులు పన్నుతోందని అన్నారు. ఉద్యోగస్తులకు జీతాలు కూడా చెల్లించడంలో అలసత్వం నెలకొందని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కేంద్రం ప్రయత్నిస్తున్నదన్న బీజేపీ ఎంపీ జీవీఎల్ వ్యాఖ్యలు వట్టి బూటకమని విమర్శించారు. విశాఖ ఉక్కు పరిరక్షణకై సీఎం ఇప్పటికైనా స్పందించాలని కోరారు. ఆంధ్రుల హక్కుగా మనగలుగుతున్న విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలోని కొనసాగుతూ అభివృద్ధి చెందేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2023-10-05T09:50:29+05:30 IST