CPM: విద్యుత్ భారాలు తగ్గించకపోతే మరో బషీర్‌బాగ్ ఉద్యమం తప్పదు
ABN , First Publish Date - 2023-06-21T09:53:02+05:30 IST
కృష్ణలంకలో విద్యుత్ భారాలకు నిరసనగా సీపీఎం పోరుబాటకు దిగింది. ఇందులో భాగంగా ఇంటింటికీ వెళ్లి కరపత్రాల ద్వారా సీఎం జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్న మోసాలను సీపీఎం నాయకులు దోనేపూడి కాశీనాథ్ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మోడీ ఆదేశాలతో జగన్ ప్రజలపై విద్యుత్, పన్నుల భారాలు మోపుతున్నారని విమర్శించారు.
విజయవాడ: కృష్ణలంకలో విద్యుత్ భారాలకు నిరసనగా సీపీఎం (CPM) పోరుబాటకు దిగింది. ఇందులో భాగంగా ఇంటింటికీ వెళ్లి కరపత్రాల ద్వారా సీఎం జగన్‌మోహన్ రెడ్డి (CM YS Jaganmohan Reddy) చేస్తున్న మోసాలను సీపీఎం నాయకులు దోనేపూడి కాశీనాథ్ (CPM Leader Donepuri Kasinath) వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మోడీ ఆదేశాలతో జగన్ ప్రజలపై విద్యుత్, పన్నుల భారాలు మోపుతున్నారని విమర్శించారు. సర్దుబాటు ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీలు, సుంకం ఛార్జీల పేరుతో ముక్కు పిండి వసూళ్లు చేస్తున్నారని మండిపడ్డారు. రెండు వేలు వచ్చే వారికి నాలుగు వేలు బిల్లు వస్తుందని.. రెండు వందలు వచ్చే వారికి ఎనిమిది వందలు వస్తుందన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలను మళ్లీ అంధకారంలోకి నెడుతున్నారని అన్నారు. వేసవిలో ఏసీలు వేస్తే బిల్లు రాదా అని ప్రచారం చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు అన్నం తింటున్నారా.. గడ్డి తింటున్నారా అని ఆయన వ్యాఖ్యలు చేశారు.
కనీసం ప్రజలకు వాస్తవాలు కూడా చెప్పలేని దుస్థితిలో ఉన్నారన్నారు. అదానీ కోసమే స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారన్నారు. బయటి రాష్ట్రాల కన్నా ఐదు రెట్లు ఎక్కువ పెట్టి కొనుగోలు చేస్తున్నారన్నారు. ప్రజలు ఈ నిర్ణయాలను తీవ్రంగా వ్యతరేకించాలని అన్నారు. విద్యుత్ భారాలు తగ్గించకపోతే మరో బషీర్‌బాగ్ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. గత పాలకుల తరహాలో జగన్ కూడా అడ్రస్ లేకుండాపోతారన్నారు. పేద ప్రజలను దోచుకోవడమే ప్రజాపాలన అని విమర్శించారు. సోషల్ మీడియా, అనుకూల మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తారా అని అడిగారు. విద్యుత్ భారాలపై వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు దమ్ముంటే చర్చకు రావాలని.. తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని... చూపిస్తాం రండి అంటూ సవాల్ విసిరారు.జగన్మోహన్ రెడ్డి తీరు మార్చుకోవాలని.. లేదంటే ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమని సీపీఎం నేత దోనేపూడి కాశీనాథ్ హెచ్చరించారు.