Amaravati Formers: అమరావతి రైతులకు కౌలు మంజూరు.. సీఆర్డీఏ ప్రకటన

ABN , First Publish Date - 2023-07-21T16:07:44+05:30 IST

అమరావతి రైతులకు కౌలు మంజూరు చేస్తున్నట్లు సీఆర్డీఏ ప్రకటించింది. 2023-24 ఆర్ధిక సంవత్సరానికి రైతులకు కౌలు చెల్లించేందుకు రూ.240 కోట్లు విడుదల చేసింది.

Amaravati Formers: అమరావతి రైతులకు కౌలు మంజూరు.. సీఆర్డీఏ ప్రకటన

అమరావతి: అమరావతి రైతులకు కౌలు మంజూరు చేస్తున్నట్లు సీఆర్డీఏ (CRDA)ప్రకటించింది. 2023-24 ఆర్ధిక సంవత్సరానికి రైతులకు కౌలు చెల్లించేందుకు రూ.240 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు సీఆర్‌డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పేరిట శుక్రవారం ప్రకటన విడుదలైంది. 24 వేల 521 మంది రైతులకు 28 వేల 491 ఎకరాలకు రూ.185 కోట్లు విడుదల కోసం ప్రతిపాదనలు రాగా.. నేటి వరకూ 23 వేల 398 ఎకరాలకు రూ.175 కోట్లు మంజూరు చేసేందుకు సీఎప్‌ఎంఎస్‌లో అప్లోడ్ అయినట్లు తెలిపారు. అసైన్డ్ భూములకు సంబంధించిన సీఐడీ విచారణలో 1751 ఎకరాల భూమి లెక్క ఇంకా తేలలేదు. సంబంధిత రైతులు ఒరిజినల్, సర్టిఫైడ్ కాపీలు ఫైల్స్‌లో లేకపోవడంతో అసైన్ట్మెంట్ వివరాలు ధృవీకరించేందుకు గుంటూరు జిల్లా కలెక్టర్‌కు సీఆర్డీఏ అధికారులు పంపిచినట్లు చెప్పారు. కలెక్టర్ నుంచి ధృవీకరణ వచ్చిన వెంటనే అర్హులైన అసైన్డ్ రైతులకు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామంటూ సీఆర్‌డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పేరిట విడుదలైన ప్రకటనలో వెల్లడించారు.

Updated Date - 2023-07-21T16:07:44+05:30 IST