TTD: అలిపిరి కాలినడక భక్తులకు దివ్యదర్శన టోకెన్లు
ABN , First Publish Date - 2023-04-16T21:11:08+05:30 IST
తిరుమల శ్రీవారిదర్శనానికి అలిపిరి మార్గంలో కాలినడకన వచ్చే భక్తులకు అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌లో దివ్యదర్శన టోకెన్లు (Divyadarshan Tokens) జారీ చేస్తున్నారు.
తిరుమల: తిరుమల శ్రీవారిదర్శనానికి అలిపిరి మార్గంలో కాలినడకన వచ్చే భక్తులకు అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌లో దివ్యదర్శన టోకెన్లు (Divyadarshan Tokens) జారీ చేస్తున్నారు. భక్తులు (Devotees) తమ ఆధార్‌కార్డు (Aadhaar Card) చూపి ఈ టోకెన్లు పొందవచ్చు. ఇక్కడ టోకెన్లు పొందిన భక్తులు అలిపిరి మార్గంలోని గాలిగోపురం 2,083వ మెట్టు వద్ద తప్పనిసరిగా స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో వారిని దివ్యదర్శన లైన్‌లో కాకుండా టైంస్లాట్ సర్వదర్శన క్యూలైన్‌లో మాత్రమే అనుమతిస్తారు. గతంలో గాలిగోపురం వద్దనే ఇచ్చే దివ్యదర్శన టోకెన్లను తాజాగా భూదేవి కాంప్లెక్స్‌కు మార్చిన విషయాన్ని భక్తులు గుర్తించాలని ఆదివారం టీటీడీ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. మరోవైపు శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకు యథాప్రకారం దివ్యదర్శన టోకెన్లను 1,240వ మెట్టు వద్ద జారీ చేస్తారు. ఇక వాహనాల్లో తిరుమల (Tirumala)కు చేరుకోవాలనుకునే భక్తులకు తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీనివాసం, రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణునివాసం, రైల్వేస్టేషన్ వెనుకభాగంలోని గోవిందరాజ సత్రాల్లో స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్‌ఎస్‌డీ) టోకెన్లు జారీ చేస్తున్నారు.