బ్రహ్మరథం

ABN , First Publish Date - 2023-02-16T01:27:32+05:30 IST

వందల్లో కార్లు.. వేలల్లో బైక్‌ లు.. అడుగడుగునా హారతులు.. పూలవర్షాలు.. అడుగు తీసి అడుగేస్తే వేలాది జనం వెరసి టీడీపీ అధి నేత జిల్లా పర్యటనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. భారీగా తరలివచ్చిన వచ్చిన అశేష జనంతో జగ్గంపేట పర్యటన తొలిరోజు విజయవంతమైంది. బుధవారం మధ్యాహ్నం రాజమహేంద్రవరం విమానా శ్రయం నుంచి గోకవరం, అక్కడి రాత్రి జగ్గంపేట బహిరంగ సభ వద్దకు వచ్చే వరకు పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు చంద్రబాబు వెనుకే ఉన్నారు.

బ్రహ్మరథం
జగ్గంపేటలో బుధవారం రాత్రి బహిరంగ సభలో బాబు ప్రసంగం

టీడీపీ అధినేత చంద్రబాబుకు జగ్గంపేటలో జననీరాజనం

వేలల్లో తరలివచ్చి అఖండ స్వాగతం పలికిన ప్రజలు.. కిక్కిరిసిన బహిరంగ సభ

గోకవరం నుంచి జగ్గంపేట వరకు హారతులు, పూలవర్షం

ప్రత్తిపాడు, జగ్గంపేట నుంచి వేలాది బైక్‌లతో స్వాగతం పలికిన రాజా, నవీన్‌

ఉదయం విమానాశ్రయానికి వందలాది కార్లతో కాకినాడ నేతల భారీ స్వాగతం

జగ్గంపేట ఎమ్మెల్యే అవినీతి చిట్టా చదివిన చంద్రబాబు.. జనం చప్పట్లే చప్పట్లు

రాత్రికి జ్యోతుల నవీన్‌ క్యాంప్‌ ఆఫీసులో బస చేసిన చంద్రబాబు

నేడు జగ్గంపేటలో ఉమ్మడి తూర్పుగోదావరి పార్టీ నేతలతో బాబు కీలక సమీక్ష

సాయంత్రం పెద్దాపురంలో బహిరంగ సభ.. రాత్రికి సామర్లకోటలో బస

కాకినాడ(ఆంధ్రజ్యోతి)/జగ్గంపేట/జగ్గంపేట రూరల్‌, ఫిబ్రవరి 15: వందల్లో కార్లు.. వేలల్లో బైక్‌ లు.. అడుగడుగునా హారతులు.. పూలవర్షాలు.. అడుగు తీసి అడుగేస్తే వేలాది జనం వెరసి టీడీపీ అధి నేత జిల్లా పర్యటనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. భారీగా తరలివచ్చిన వచ్చిన అశేష జనంతో జగ్గంపేట పర్యటన తొలిరోజు విజయవంతమైంది. బుధవారం మధ్యాహ్నం రాజమహేంద్రవరం విమానా శ్రయం నుంచి గోకవరం, అక్కడి రాత్రి జగ్గంపేట బహిరంగ సభ వద్దకు వచ్చే వరకు పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు చంద్రబాబు వెనుకే ఉన్నారు. కాకినాడ నుంచి పార్టీ సీనియర్‌ నేత గుణ్ణం చంద్రమౌళి ఆధ్వర్యంలో భారీగా కార్ల ర్యాలీతో విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలికారు. జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు పావని ఆధ్వర్యంలో చంద్రబాబును ఎయిర్‌పోర్టు లాంజ్‌లో కలిసి స్వాగతం పలి కారు. అలాగే పెద్దాపురం ఎమ్మెల్యే రాజప్ప, పిఠాపురం, కాకినాడ మాజీ ఎమ్మెల్యేలు వర్మ, కొండబాబు, ప్రత్తిపాడు ఇన్‌చార్జి వరుపుల రాజా తదితరులు ఎయిర్‌పోర్టులో చంద్రబాబును కలిసి స్వాగతం పలికారు. అక్కడినుంచి పార్టీ నేతలు, వేలాది మంది కార్య కర్తలతో కలిసి రెట్టించిన ఉత్సాహంతో చంద్రబాబు గోకవరం, అక్కడి నుంచి జగ్గంపేట ప్రయాణించారు. ఎక్కడికక్కడ జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. తొలుత విమానాశ్రయంలో పార్టీ నేతలు గజమాలలతో చంద్రబాబును స్వాగ తించగా, జగ్గంపేట మండలం మల్లిశాల వచ్చేసరికి ప్రజలు, కార్యకర్తలు పూల హారతులు పట్టారు. చంద్రబాబు రాక కొంత ఆలస్యం అయినా వేలల్లో జనం వేచి ఉన్నారు. మల్లిశాల తర్వాత వెంగాయపురం, రాజపూడి గ్రామాల మీదుగా బాబు పర్యటన సాగింది. రాజపూడి, జగ్గంపేటలలో ఎన్టీఆర్‌ విగ్రహాల ప్రారం భం అనుకున్నా కోడ్‌ నేపథ్యంలో ప్రారంభించలేదు. ఆ తర్వాత రాత్రి 8.30 గంటలకు జగ్గంపేట బహిరంగ సభ వద్దకు వచ్చిన చంద్రబాబు ఉత్సాహంగా గంటపాటు ప్రసంగించారు. జిల్లాలో పుష్కర, ఏలేరు, పురుషోత్తపట్నం ఫేజ్‌2 కట్టించిన ఘనత టీడీపీదేనన్నారు. జిల్లాలో ఎక్కడికక్కడ రహదారులు టీడీపీ హయాంలోనే వచ్చాయని వివరించారు. ఆ తర్వాత చంద్రబాబు తన ప్రసం గంలో జగ్గంపేట ఎమ్మెల్యే అవినీతి చిట్టా విప్పడంతో జనం హర్షధ్వానాలు ప్రక టించారు. రామేశంమెట్టలో వందల ఎకరాలను ఎమ్మెల్యే మింగేసి అనకొండగా మారారన్నప్పుడు జనం చప్పట్లు కొట్టారు. జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు అమాయకుడు అనుకుంటే పెద్ద ఘనుడే అని విమర్శించారు. ఇర్రిపాకలో వందెకరాలు, మరోచోట 549 ఎకరాల్లో చేపల చెరువులను ఎమ్మెల్యే చెరబట్టాడని ధ్వజమెత్తారు. ఇళ్ల స్థలాల్లోను ఎకరాకు రూ.24లక్షల కమీషన్‌ కొట్టేశాడన్నారు. కాగా టీడీపీ అధికారంలోకి వచ్చాక జగ్గంపేటకు కార్పొరేట్‌ స్థాయి ప్రభుత్వ ఆసుపత్రి, గోకవరం, కిర్లంపూడిలలో డిగ్రీ కాలేజీలు కొత్తవి మంజూరు చేస్తా మని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. మరోపక్క చంద్రబాబు జగ్గంపేట సభ ప్రారంభానికి ముందు మాజీ ఎమ్మెల్యే నెహ్రూ, ముఖ్య నేతలు ప్రసంగించారు. టీడీపీతోనే రాష్ట్రానికి శుభకరం అని ఆయన పేర్కొన్నారు.

నేడు సమీక్ష.. బహిరంగ సభ..

చంద్రబాబు పర్యటనలో భాగంగా గురువారం ఉదయం 11 గంటలనుంచి ఒంటి గంట వరకు కాకినాడ రోడ్డులోని జగ్గంపేట హెచ్‌పీ బంకు సమీపంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ నేతలతో కీలక సమీక్ష నిర్వహించను న్నారు. వచ్చే ఎన్నికల్లో విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించ నున్నారు. ముఖ్యంగా జిల్లాలో ప్రత్తి పాడు లేటరైట్‌, పెద్దాపురం రామేశం మెట్ట దోపిడీ భారీగా ఉంది. ఈ వ్యవ హారాలన్నీ టీడీపీ నేతలు చంద్ర బాబుకు వివరించారు. దీనిపై చంద్రబాబు మాట్లాడే అవకాశం ఉంది. ఈ సమీక్ష తర్వాత సాయంత్రం 4.30 గంటల నుంచి పెద్దాపురం దర్గా సెంటర్‌ నుంచి రోడ్డుషో నిర్వహిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 5.30 నుంచి 6.30 వరకు పెద్దాపురంలో బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. రాత్రికి సామర్లకోట షుగర్‌ ఫ్యాక్టరీలో బస చేస్తారు.

ముంపు మండలాల ప్రజల కోసం..ప్రత్యేక జిల్లా

అధికారంలోకి రాగానే ప్రకటిస్తాం

జగన్‌ బొమ్మల పిచ్చోడు

సర్వే రాళ్లపైనా జగన్‌ బొమ్మలా..

ఈ సైకోను సాగనంపాలి

రోడ్‌ షోలో చంద్రబాబు విమర్శలు

రాజమహేంద్రవరం(ఆంధ్రజ్యోతి), ఫిబ్రవరి 15: ‘పోలవరాన్ని జగన్‌ గోదాట్లో కలిపేశాడు. కాంట్రాక్టర్‌ను మార్చవద్దని కేంద్రం చెప్పినా వినకుండా మార్చి మొత్తం పాడు చేశాడు. ఎకరానికి రూ.9 లక్షలు ఇస్తానన్నాడు. వాళ్ల నాన్న ఎకరానికి రూ.1.5లక్షలు ఇచ్చిన భూమికి తాను రూ.5 లక్షలు అదనంగా ఇస్తానని, చివరకు ఏమీ చేయలేదు. నిర్వాసితులకు న్యాయం చేసేది తెలుగుదేశం పార్టీయే. తమ భూములను త్యాగం చేసిన పోలవరం నిర్వాసిత ప్రజల కోసం ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తాం’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుఇచ్చారు. ‘ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి’ కార్యక్రమంలో భాగంగా బుధవారం మధురపూడి నుంచి గోకవరం మండలం వరకూ పర్యటించి, తర్వాత కాకినాడ జిల్లా పరిధిలో జగ్గంపేట వెళ్లారు. 3గంటల ప్రాంతంలో మధురపూడి విమానాశ్రయానికి వచ్చిన చంద్రబాబు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆదిరెడ్డి భవాని, నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ తదితరులు స్వాగతం పలకగా, విమానాశ్రయం ప్రాంగణంలోనూ, వెలుపల వేలాది మంది టీడీపీ శ్రేణులు స్వాగతం పలికాయి. కోరుకొండ-గోకవరం రోడ్డులో చంద్రబాబు భారీ కాన్వాయ్‌తో పర్యటించారు. పార్టీ నేత ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో ఇక్కడ ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా పలుచోట్ల ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ప్రాముఖ్యమైన పోలవరం ప్రాజెక్టును సైకో జగన్‌ గోదాట్లో కలిపివేశాడు.. రాష్ట్ర విభజన అంశంగా పోలవరాన్ని కేంద్రం పెట్టింది. కానీ ప్రాజెక్టు పూర్తి చేయలేదమో అనే కారణంతో నీతిఅయోగ్‌ రాష్ట్రానికి అప్పగించాలని రికండ్‌ చేయడంతో ప్రధాని మోదీ రాష్ట్రానికి అప్పగించారు. ఏడు మండలాల విలీనం చేయకపోతే ఈ ప్రాజెక్టు పూర్తికాదనే కారణంతో నేను సీఎంగా ప్రమాణం చేయకుండా ఒక మిత్రపక్ష నేతగా అప్పట్లో ప్రధాని మోదీ ప్రమాణస్వీకానికి వెళ్లి ఏడు మండలాలను విలీనం చేయమని చెప్పాను.. లేకపోతే తనకు సీఎం పదవి వద్దని చెప్పానని చంద్రబాబు అన్నారు. దానికి మోదీ స్పందించి ప్రత్యేక ఆర్డినెన్స్‌ను జారీచేసి ఏడు మండలాలను విలీనం చేశారని గుర్తుచేశారు. సాధారణంగా పార్లమెంట్‌ సమావేశాల్లో పెట్టి విలీనం చేయాలని.. కానీ చరిత్రలో ఏనాడు లేనివిధంగా పార్లమెంట్‌కు ముందే ఈ నిర్ణ యం చేశారని చంద్రబాబు తెలిపారు. నేను ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాను. 28 సార్లు పర్యటించాను. 78 సార్లు సమీక్షలు చేశాను. ‘ప్రతి సోమవా రం పోలవరం’ కార్యక్రమంగా మార్చి 72 శాతం పనులు పూర్తిచేశాను. దీనికంటే ముందు కుడి, ఎడమ ప్రధాన కాలువల పనుల విషయంలో అనేకమంది కోర్టుకు వెళ్లారు. నేను పట్టుదలతో వారికి నష్టపరిహారం పంచి కోర్టు కేసులు పరిష్కరించి పనులు సాగించానని ఆయన స్పష్టంచేశారు. కాటన్‌దొర ధవళేశ్వరం బ్యారేజీ కట్టడం వల్లే ఆయన్ని ఇప్పటికీ జనం పూజిస్తున్నారని చెప్పారు. కానీ సైకో జగన్‌ సీఎం అయ్యాక పోలవరానికి రివర్స్‌ టెండరింగ్‌ పెట్టి సర్వం నాశనం చేశాడని దుయ్యబట్టారు. ఈ సీఎం పోలవరాన్ని కట్టడు, ధవళేశ్వరం బ్యారేజీ మాదిరిగా ఇక్కడ 41.15 మీటర్ల ఎత్తున మరొక బ్యారేజీ కడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఇంటింటికీ జగన్‌ స్టిక్కర్లు అంటిస్తాడట. దీనిపై ప్రజలు తిరగబడాలి. జగన్‌ మన భూముల పట్టాపుస్తకాల మీద, సర్వే రాళ్ల మీద కూడా అతని బొమ్మ వేసుకుంటున్నాడు. మన ఆస్తి మీద అతడి బొమ్మేంటని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ సైకో ముఖ్యమంత్రిని అంతా కలిసి సాగనంపాలని ఆయన పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ సామాన్య కార్యకర్తగా ఇక్కడ పాల్గొనడం గమనార్హం.

Updated Date - 2023-02-16T01:27:34+05:30 IST