రేపు నిడదవోలుకు సీఎం జగన్‌

ABN , First Publish Date - 2023-02-28T00:36:25+05:30 IST

సీఎం జగన్‌ బుధ వారం నిడదవోలు సెయింట్‌ ఆంబ్రోస్‌ హైస్కూ ల్‌లో ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌ నాయుడు కుమార్తె డాక్టర్‌ సౌమ్యశ్రీ వివాహ రిసెప్షన్‌కు హాజరుకా నున్నారు.

రేపు నిడదవోలుకు సీఎం జగన్‌
పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ మాధవీలత

నిడదవోలు, ఫిబ్రవరి 27 : సీఎం జగన్‌ బుధ వారం నిడదవోలు సెయింట్‌ ఆంబ్రోస్‌ హైస్కూ ల్‌లో ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌ నాయుడు కుమార్తె డాక్టర్‌ సౌమ్యశ్రీ వివాహ రిసెప్షన్‌కు హాజరుకా నున్నారు. సుబ్బరాజుపేటలో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్‌ వద్ద బుధవారం ఉదయం 10.30 గం టలకు హెలికాప్టర్‌లో దిగి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న సెయింట్‌ ఆంబ్రోస్‌ హైస్కూ ల్‌లోని వేదిక వద్దకు రానున్నారు. తిరిగి 11 గం టలకు బయలుదేరి వెళ్లనున్నారు.ఈ మేరకు రెవెన్యూ పోలీస్‌ అధికారులు ఏర్పాట్లలో బిజీబిజీగా ఉన్నారు. సీఎం జగన్‌ పర్యటించనున్న ప్రాంతాన్ని సోమవారం సాయంత్రం కలెక్టర్‌ కె.మాధవీలత పరిశీలించారు. ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌ నాయుడు, కొవ్వూరు డీఎస్పీ వర్మలతో ఏర్పాట్లపై చర్చించారు.

Updated Date - 2023-02-28T00:36:25+05:30 IST