మీ సేవలు స్ఫూర్తిదాయకం
ABN , First Publish Date - 2023-01-13T00:30:54+05:30 IST
మీ సేవలు అందరికీ స్ఫూర్తిదాయకం. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా, జాతీయ లోక్ అదాలత్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉం టూ జిల్లా న్యాయమూర్తిగా ఎన్నోసేవలందిం చా రని కలెక్టర్ డా. కె.మాధవీలత అన్నారు.
రాజమహేంద్రవరం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి) : మీ సేవలు అందరికీ స్ఫూర్తిదాయకం. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా, జాతీయ లోక్ అదాలత్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉం టూ జిల్లా న్యాయమూర్తిగా ఎన్నోసేవలందిం చా రని కలెక్టర్ డా. కె.మాధవీలత అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వెంకట జ్యోతిర్మయిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా నియమిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజయం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కలెక్టర్ గురువారం జిల్లా జడ్జి బంగ్లాలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపా రు. కలెక్టర్ వెంట జేసీ ఎన్.తేజ్‌భరత్, మునిసిపల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్ ఉన్నారు.