అవినీతి జాడలు!

ABN , First Publish Date - 2023-01-05T00:01:07+05:30 IST

తప్పు చేసిన వాడిని శిక్షించకపోతే తరువాత ఆ సీటులోకి వచ్చిన వారికి తప్పు చేయాలనిపిస్తోంది.. ఎందుకంటే తప్పు చేసినా చర్యలేం ఉండవు కదా అనే ధైర్యం వస్తోంది. ఇక చూస్కో నీకెంత.. నాకెంత.. దీనికి ధవళేశ్వరం పంచాయతీనే నిదర్శనం.

అవినీతి జాడలు!

కోట్లలో సొమ్ము పక్కదారి?

రూ. 5 కోట్లు ఉండొచ్చని అంచనా

జిల్లా కేంద్రంలోనే దారుణం

అధికారులు మారినా ఇంతే

పట్టించుకోని ఉన్నతాధికారులు

ఇప్పటికీ షోకాజ్‌ నోటీసులతో సరి

ఆరోపణలున్నా నేటికీ ఉద్యోగంలోనే

పంచాయతీకి రాని ప్రస్తుత కార్యదర్శి

తప్పు చేసిన వాడిని శిక్షించకపోతే తరువాత ఆ సీటులోకి వచ్చిన వారికి తప్పు చేయాలనిపిస్తోంది.. ఎందుకంటే తప్పు చేసినా చర్యలేం ఉండవు కదా అనే ధైర్యం వస్తోంది. ఇక చూస్కో నీకెంత.. నాకెంత.. దీనికి ధవళేశ్వరం పంచాయతీనే నిదర్శనం. 2012 - 2014లో ధవళేశ్వరం పంచాయతీలో సుమారు రూ.2 కోట్లు పైన అవకతవకలు ఆడిట్‌లో బయటపడ్డాయి. అప్పటి నుంచి సుమారు నలుగురు కార్యదర్శులు మారారు.. ఒకరి తరువాత మరొకరు లెక్కల్లో తేడా చేసినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇంత జరిగినా అధికారులు చేపట్టిన చర్యలు శూన్యం.. ఏకంగా ఒక కార్యదర్శి అయితే లాగ్‌బుక్‌ కూడా తీసుకెళ్లిపోయారు.. నేటికీ అతీగతీ లేదు. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నా ఉన్నతాధికారులు మాత్రం స్పందించడం లేదు. ఇటీవల లెక్కతప్పినట్టు నివేదిక వచ్చినా షోకాజ్‌ నోటీసుతో సరిపెట్టారు.. సొమ్ము రికవరీపై దృష్టి సారించిన దాఖలాలే లేవు..ఇదిలా ఉంటే.. ప్రస్తుత కార్యదర్శి పంచాయతీకే రాకపోవడంతో గ్రామస్థులు గగ్గోలు పెడుతున్నారు.

రాజమహేంద్రవరం రూరల్‌ జనవరి 4 : ప్రభుత్వాలు మారుతున్నాయి.. అధికారుల మారుతున్నారు.. కానీ పంచాయతీల్లో అవినీతి, నిధుల దుర్వినియోగం మాత్రం అరికట్టలేకపోతున్నారంటే అతిశయోక్తికాదు. రాజమహేంద్రవరం రూరల్‌ మండలం పరిధిలో పలు గ్రామాలు సుమారు 15 ఏళ్లుగా ప్రత్యేకాఽధికారుల పాలనలో ఉన్నాయి. కొన్ని గ్రామాలకు ఐఏఎస్‌ అధికారులు ప్రత్యేకాధికారులుగా విధులు చేపట్టారు.అయినా ఆయా గ్రామాల్లో కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతూనే ఉంది.

షోకాజ్‌ నోటీసుతో సరి..

ధవళేశ్వరం గ్రామానికి సంబంధించి 2014వ సంవ త్స రంలో నిర్వహించిన ఆడిట్‌లో రూ.2 కోట్లు పైన అవకతక వలు జరిగినట్టు బయటపడింది.ఆ తరువాత నుంచి ఇప్పటి వరకూ నలుగురు కార్యదర్శులు మారారు. వీరిలో ఇన్‌చార్జి కార్యదర్శిగా పనిచేసిన సురేంద్ర చనిపోయారు. మిగిలిన ముగ్గురు ఉన్నారు. వీరిలో ఒకరు ఉద్యోగ విరమణ చేయగా.. మరో ఇద్దరు కార్యదర్శులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసినట్టు ఆరోపణ లున్నా చర్యలు మాత్రం లేవు. తాజాగా ఏప్రిల్‌ 2020 నుంచి ఏప్రిల్‌ 2022 వరకు రూ.కోటి 19 లక్షల 953ల పంచాయతీ నిధులు పక్కదారి పట్టినట్టు డివిజనల్‌ పంచాయతీ అధికారి నివేదిక ఇచ్చారు.ఈ మేరకు అప్పటి కార్యదర్శి కె.చంద్రశేఖర్‌కు డిసెంబరు 2023లో జిల్లా కలెక్టర్‌ షోకాజ్‌ నోటీసు జారీ చేశారు.నేటికీ చర్యలు మాత్రం శూన్యం. గత 8 ఏళ్లుగా మొ త్తం సుమారు రూ.5 కోట్ల వరకూ సొమ్ము లెక్కతేలలేదు.

2020లో లెక్క తప్పించారిలా..

నగదు పుస్తకంలో మే 2020 ముగింపు నిల్వ రూ.63,85,463గా నమోదుచేసి దీనిలో రూ. 62,30, 427లు పూర్వపు జూనియర్‌ అసిస్టెంట్‌ కె.సురేంద్ర వద్ద ఉన్నట్టు నమోదు చేశారు. మిగిలిన రూ.1,55,036 తదుపరి నెల ప్రారంభపు నిల్వగా చూపారు. బిల్లు కలెక్టర్‌ సిరికొండ శ్రీనివాసరావు వసూలు చేసిన రూ. 24,573 నగదు పుస్తకంలో నమోదు చేయలేదు. బిల్లు కలెక్టర్లు నరసాల వెంకటరెడ్డి, బొరుసు పరమేశ్వరరావు, సూర్యచంద్రశేఖర్‌ వసూలు చేసిన సొమ్ములు రూ.44,218 నగదు పుస్తకంలో నమోదు చేయలేదు. మార్చి 2022లో బిలు కల్టెక్టర్లు వరసాల వెంకటరెడ్డి, బొరుసు పరమేశ్వరరావు, కురుపల్లి ప్రవీణ్‌ బాబు, సూర్యచంద్ర శేఖర్‌ వసూళ్ల ప్రకారం బీసీఆర్‌ పుస్తకంలో రూ.3,18,836లగా నమోదు కాగా నగదు పుస్తకంలో రూ.3,53,654 నమోదు చేశారు. అంటే రూ.34,818లు అధికంగా నమోదు చేసినట్టయ్యింది. బిల్లు కలెక్టర్‌ వరసాల వెంకటరెడ్డికి ఇంటిపన్నుల నిమిత్తం రూ.23,987 చెక్కు రాగా సదరు చెక్కును నగదు పుస్తకంలో నమోదు చేయలేదు.28 సెప్టెంబరు 20 21న జియో కంపెనీ నుంచి వచ్చిన రూ. 1,36,127 నగదు పుస్తకంలో రెండు సార్లు నమోదు చేశారు. బండారు సింహాద్రిరావు శాశ్వత స్వీపర్‌కు ఇవ్వవలసిన రూ.10,55,080 సీఎఫ్‌ఎంఎస్‌ బెనిఫిషిరీ ఖాతా ఉన్నప్పటికి అతని ఖాతాకు జమచేయకుండా పంచాయతీ కార్యదర్శి పేరున గల కరెంట్‌ ఖాతాకు జమచేయడం జరిగింది. నగదు పుస్తకం ద్వారా సీఎఫ్‌ఎం ఎస్‌ ఖాతాకు రూ.2 లక్షలు, గతంలో ధవళేశ్వరం పంచాయతీలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తూ ప్రస్తుత పిడింగొయ్యి ఇన్‌చార్జ్‌ కార్యదర్శి మనోజ్‌ కుమార్‌ రూ.3.54,450, జూనియర్‌ అసిస్టెంట్‌ బాలరాజు ఖర్చుల నిమిత్తం ఇవ్వవలసిన రూ. 6,87,579, పూడిక తీత పనులకు సంబంధించి చెల్లించిన రూ. 5,54,801లు నిబంధనలకు విరుద్ధంగా ఖర్చుచేసినట్టు నివేదికలో పేర్కొన్నారు.

కొరవడిన పర్యవేక్షణ..

గ్రామాల్లో పన్నులు వసూలు చేసి ఎప్పటికప్పుడు పంచాయతీ ట్రెజరీ ఖాతాలో జమచేయాలి. పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శి పై ఉంటుంది. పన్నుల ద్వారా వచ్చే ఆదాయ వ్యయాలు, నగదు పుస్తకం నిర్వహణ తదితర అంశాలు ప్రతి మూడు నెలలకోసారి ఈవోపీఆర్‌డీ.. ప్రతి ఆరు నెలలకొకసారి డీఎల్‌పీవో పంచాయతీ రికార్డులు పరిశీలిం చాలి.జమ ఖర్చులు ఆడిట్‌ నిర్వహించాలి.ప్రస్తుతం ఇవన్నీ తూతూమంత్రమే.ప్రత్యేకాధికారులుగా ఐఏఎస్‌, గ్రూప్‌ వన్‌ అధికారులు ఉన్నా కోట్లాది రూపాయలుఅవకతవకలు,నిధుల దుర్వినియోగం అయ్యా యంటే ఒక సామెత గుర్తుకొస్తుంది ..అందరూ శ్రీమహావైష్ణవులే కానీ ప్లేటులో రొయ్యలు యాయమయ్యాయంట..డీపీవో, డీఎల్‌పీవో, ఈవోపీఆర్డీ, ఆడిట్‌ ఆధికారులు వారి విధులు సక్రమంగా నిర్వహిస్తే గ్రామాల్లో అవినీతిని అరికట్టవచ్చని పలువురు చెబుతున్నారు.

చాలా పంచాయతీల్లో ఇదీ సీన్‌..

రాజమహేంద్రవరం డివిజన్‌ పరిధిలో అనపర్తి, గోకవరం, వేమగిరి, చినకొండేపూడి, దివాన్‌చెరువు, లాలాచెరువు పిడింగొయ్యి, బొమ్మూరు, హుకుంపేట తదితర గ్రామాల్లో నిధులు దుర్వినియోగం జరిగినట్టు అరోపణలు ఉన్నాయి. కొన్ని పంచాయతీల్లో లోపాయికారి విచారణ నిర్వహించి నివేదికను బయటకు రాకుండా బుట్టదాఖలు చేశారని పలువురు విమర్శస్తున్నారు. ధవళేశ్వరం పంచాయతీకి సంబంధించి 2014 నుంచి విచారణ చేపడితే కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం ఖజానాకు చేరుతుందని గ్రామస్థులు చెబుతున్నారు.

పంచాయతీకి రాని కార్యదర్శి..

ధవళేశ్వరం పంచాయతీలో ప్రస్తుత కార్యదర్శి అం దుబా టులో ఉండడంలేదని గ్రామస్థులు ఆరోపిస్తు న్నారు.. ఎక్కడో ఒక సచివాల యంలో ఉండి పంచా యతీ కార్యాలయానికి మాత్రం రావడం లేదు. దీంతో పాలన కుంటుపడుతోంది. ప్రతి రోజూ పలు పనుల నిమిత్తం ప్రజలు పంచాయతీకి వస్తుంటారు. అయితే వారికి ఎప్పుడు వెళ్లినా కార్యదర్శి కాన రావడంలేదు. సిబ్బందిని అడిగితే రేపు వస్తారని మాత్రం చెబుతు న్నారు.తరువాత రోజు వెళ్లినా అదే సమాధానం వినిపి స్తోంది.దీంతో ప్రజలు విసుగెత్తిపోతున్నారు. సాధారణ ప్రజలదే కాదు.. నాయకులదీ ఇదే పరిస్థితి. మరో పక్క పం చాయతీలో పారిశుధ్యం అధ్వానంగా మారింది. ఏ వీధి చూసినా చెత్తతో దర్శనమిస్తున్నాయి.ఇకనైనా ప్రత్యేకాధికా రిగా ఉన్న ఆర్‌డీవో చైత్రలక్ష్మి ధవళేశ్వరం పంచాయతీపై దృష్టి సారించాల్సి ఉంది.

Updated Date - 2023-01-05T00:01:13+05:30 IST