డీ-వార్మింగ్‌పై శిక్షణ

ABN , First Publish Date - 2023-02-03T00:24:47+05:30 IST

జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా.ఎం.శాంతిప్రభ ఆధర్యంలో ప్రోగ్రాం ఆఫీసర్లు, మెడికల్‌ ఆఫీసర్లకు గురువారం డీఎంహెచ్‌వో కార్యాలయం లో డీ-వార్మింగ్‌ (నులిపురుగులు నివారణ)పై శిక్షణ నిర్వహించారు. ఈనెల 10న, ఆగస్టు 10న జరగబోయే ఎండీఏ (మాస్‌ డ్రగ్‌ అడ్మినిస్రేషన్‌) ప్రోగ్రాం తెలియజేస్తూ దేశంలోని 250 జిల్లాల్లో లింపాటిక్‌ ఫైలేరియా కేసులు నమోదువుతున్నాయని అందులో మ

డీ-వార్మింగ్‌పై శిక్షణ

జీజీహెచ్‌ (కాకినాడ), ఫిబ్రవరి 2: జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా.ఎం.శాంతిప్రభ ఆధర్యంలో ప్రోగ్రాం ఆఫీసర్లు, మెడికల్‌ ఆఫీసర్లకు గురువారం డీఎంహెచ్‌వో కార్యాలయం లో డీ-వార్మింగ్‌ (నులిపురుగులు నివారణ)పై శిక్షణ నిర్వహించారు. ఈనెల 10న, ఆగస్టు 10న జరగబోయే ఎండీఏ (మాస్‌ డ్రగ్‌ అడ్మినిస్రేషన్‌) ప్రోగ్రాం తెలియజేస్తూ దేశంలోని 250 జిల్లాల్లో లింపాటిక్‌ ఫైలేరియా కేసులు నమోదువుతున్నాయని అందులో మన జిల్లా ఒక్కటని, ఈ నేపథ్యంలో 10న డీఈసీ, అల్జెండజోల్‌ మాత్రలు మింగించడం 11,12న మాపప్‌ చేయాల్సిందిగా డీఎంహెచ్‌వో ఆదేశించారు. ఈ ఎండిఏ ప్రోగ్రాం జిల్లాలో 5 బ్లాక్‌లుగా నిర్వహించడం జరుగుతుందని, ఒక్కో బ్లాక్‌కు ఆయా ప్రోగ్రాం ఆఫీసర్‌లను పర్యవేక్షించాల్సిందిగా ఆదేశించారు. రెండేళ్ళలోపు పిల్లలు, గర్భిణిలు, దీర్ఘకాలిక వ్యాధులలో బాధపడేవారితో అల్జెండజోల్‌ మింగించరాదన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీఎంహెచ్‌వో డా.రమేష్‌, ప్రోగ్రాం ఆఫీసర్లు డా.కె.పత్యనారాయణ, డాప్రభాకర్‌, డా. శ్రీనివాస్‌, డా.భాస్కర్రావు, డా.సుమతి పాల్గొన్నారు.

Updated Date - 2023-02-03T00:24:48+05:30 IST