‘ఫ్యామిలీ డాక్టర్’కు విస్తృత ప్రచారం కల్పించాలి
ABN , First Publish Date - 2023-05-20T01:00:47+05:30 IST
ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్‌నకు విస్తృత ప్రచారం కల్పించాలని డీఎంఅండ్‌హెచ్‌వో కె.వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఉండ్రాజవరం, పెరవలి మండలం కానూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వెంకటేశ్వరరావు
ఉండ్రాజవరం, కానూరు పీహెచ్‌సీల తనిఖీ
ఉండ్రాజవరం/పెరవలి, మే 19: ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్‌నకు విస్తృత ప్రచారం కల్పించాలని డీఎంఅండ్‌హెచ్‌వో కె.వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఉండ్రాజవరం, పెరవలి మండలం కానూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్‌ను గ్రామాల్లో ప్రజలకు తెలిసేలా ప్రచారం చేసి, వారికి వైద్యసేవలు అందుబాటులో ఉండాలన్నారు. ఎఫ్‌పీసీ ద్వారా వైద్య సేవలు, సలహాలు తీసుకునేటట్టు పోత్సహించాలన్నారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు రాకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యసేవలు అందించాలని డీఎంఅండ్‌హెచ్‌వో చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ కాన్పుల సంఖ్య పెంచాలన్నారు. గ్రామ స్థాయిలో జరిగే అన్ని కార్యక్రమాల్లో నూరు శాతం లక్ష్యాలు సాధించాలన్నారు. పీహెచ్‌సీల్లో రికార్డులను, జాతీయ వైద్య కార్యక్రమాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆసుపత్రిలో రోగులకు సిబ్బంది అందించే సేవలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పీహెచ్ సీల వైద్యులు డాక్టర్ ఆర్‌ఎస్ ప్రసాద్, డాక్టర్ తేజస్వి, డాక్టర్ హేమరాజు, పీహెచ్‌ఎన్ డి.కుమారి, సిబ్బంది పాల్గొన్నారు.