కదిలిన అటవీ శాఖాధికారులు
ABN , First Publish Date - 2023-01-20T00:43:28+05:30 IST
అటవీ ప్రాంతంలో అక్రమాలు జరగకుండా వనసం రక్షణ సమితి సభ్యులతో పాటు బీటు అధికా రులను నియమించి టాస్క్‌పోర్సు సిబ్బం దితో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని డీఆర్వో చల్లా శ్రీనివాస్ తెలిపారు.
గోపాలపురం/నల్లజర్ల, జనవరి 19: అటవీ ప్రాంతంలో అక్రమాలు జరగకుండా వనసం రక్షణ సమితి సభ్యులతో పాటు బీటు అధికా రులను నియమించి టాస్క్‌పోర్సు సిబ్బం దితో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని డీఆర్వో చల్లా శ్రీనివాస్ తెలిపారు. ‘‘అడవి మాయం’’ పేరుతో ‘‘ఆంధ్రజ్యోతి దినపత్రి క’’లో గురువారం ప్రచురితమైన కథనానికి అటవీ శాఖ యంత్రాంగం కదిలింది. తూర్పుగోదావరి జిల్లా గోపా లపురం నియోజకవర్గంలోని కరగపాడు, నల్లజర్ల, దూబచర్ల అటవీ ప్రాంతాన్ని తన సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో గురువారం పరిశీలించారు. అటవీ సంపదను తరలించినా, కొల్లగొట్టినా చర్యలు తీవ్రంగా ఉంటాయని తెలిపారు. నల్లజర్లలో ఇంటెలిజెన్స్ అధికారులు దూబచర్ల గాంఽధీ కాలనీలో కలప వ్యాపారం చేసే వ్యక్తుల పేర్లు సేకరించారు. నెంబరు ప్లేటు లేని ట్రాక్టర్ ట్రక్ వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. దూబచర్లలో పరిసరాల ప్రాంతాల్లో 10 మంది కలప వ్యాపారులు ఉన్నట్టు సమాచారం. వీరే అడవిని ఖాళీ చేస్తారని స్థానికులు చెబుతున్నారు. దీనిపై అటవీ అధికారులు దృష్టి సారించాల్సి ఉంది.