ప్రకృతి వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్‌కు గెయిల్‌ కృషి

ABN , First Publish Date - 2023-01-12T00:26:26+05:30 IST

ప్రకృతి వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్‌కు గెయిల్‌ సంస్థ కృషిచేస్తుందని గెయిల్‌ సీనియర్‌ సీఎస్‌ఆర్‌ హెచ్‌ఆర్‌ బి.బాలాజీ అన్నారు.

ప్రకృతి వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్‌కు గెయిల్‌ కృషి
వ్యవసాయ కిట్లను అందజేస్తున్న బాలాజీ తదితరులు

కొవ్వూరు, జనవరి 11 : ప్రకృతి వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్‌కు గెయిల్‌ సంస్థ కృషిచేస్తుందని గెయిల్‌ సీనియర్‌ సీఎస్‌ఆర్‌ హెచ్‌ఆర్‌ బి.బాలాజీ అన్నారు. కొవ్వూరు మండలం పెనకనమెట్ట గ్రామంలో బుధవారం రాజమహేంద్రవరం గెయిల్‌, కేర్‌ ఇండియా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. దొమ్మేరు, పెనకనమెట్ట గ్రామాలకు చెందిన 100 మంది రైతులను గుర్తించి ఒక్కొక్కరికి రూ.2 వేలు విలువైన సేంద్రియ ఎరువుల కిట్లు పంపిణీ చేశారు. రానున్న రోజుల్లో మరింత మంది రైతులు సేంద్రియ వ్యవసాయంపై ఆసక్తి కనబర్చాలన్నారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు గెయిల్‌ కంపెనీ సహకారం అందిస్తుందన్నారు. కేర్‌ ఇండియా ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ నబేష్‌ మాట్లాడుతూ గెయిల్‌ సంస్థ అందిస్తున్న సహాకారాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తాడేపల్లిగూడెం వెంకట్రామన్నగూడెం హార్టికల్చర్‌ వర్శిటీ శాస్త్రవేత్త రాఘ వేంద్రరెడ్డి భూమిలో కర్భన్‌ శాతం పూర్తిగా తగ్గిపోయింది.. ఎరువులు, పురుగులు మందులు అధికంగా వినియోగిస్తే భూసారం తగ్గిపోతుందన్నారు. గతంలో నిర్వహించిన భూసార పరీక్షల పత్రాలను రైతులకు అందజేశారు. ప్రకృతి వ్యవసాయం చేసి భూసారం పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కేర్‌ ఇండియా ప్రాజెక్టు మేనేజర్‌ జె. ప్రసాద్‌, ఆదిత్య, సుశీల, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-12T00:26:28+05:30 IST