భూవిజ్ఞాన శాస్త్రాల్లో పట్టు సాధించాలి

ABN , First Publish Date - 2023-07-02T00:48:32+05:30 IST

భూవిజ్ఞాన శాస్త్రాలలో విద్య, పరిశోధనల్లో పట్టు సాధించాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ఆచార్య టి.అశోక్‌ అన్నారు. నన్నయ వర్శిటీ భూవిజ్ఞాన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో డీఎస్‌ఎన్‌ రాజు, ఎంవీజీ సుబ్రహ్మణ్యం స్మారక ఉపన్యాస సిరీస్‌, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు.

భూవిజ్ఞాన శాస్త్రాల్లో పట్టు సాధించాలి

  • నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో నన్నయ వర్శిటీ రిజిస్ట్రార్‌ అశోక్‌

దివాన్‌చెరువు, జూలై 1: భూవిజ్ఞాన శాస్త్రాలలో విద్య, పరిశోధనల్లో పట్టు సాధించాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ఆచార్య టి.అశోక్‌ అన్నారు. నన్నయ వర్శిటీ భూవిజ్ఞాన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో డీఎస్‌ఎన్‌ రాజు, ఎంవీజీ సుబ్రహ్మణ్యం స్మారక ఉపన్యాస సిరీస్‌, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. రిజిస్ట్రార్‌ అశోక్‌ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. విభాగాధిపతి ఆచార్య వై.శ్రీనివాసరావు అధ్యక్షత వహించి విరాలను తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రిజిస్ట్రార్‌ మాట్లాడుతూ మహనీయులను ఆదర్శంగా తీసుకుని ఉన్నతస్థానాలను అధిరోహించాలని అన్నారు. చెన్నై ఓఎన్‌జీసీ పూర్వ చీఫ్‌ జియాలజిస్ట్‌ ఎ.నల్లపరెడ్డి, జీఎన్‌ఐ మాజీ డైరెక్టర్‌, ఓఎస్‌ జియో-ఇండియా కార్యదర్శి ఉండవల్లి రవికుమార్‌ పలు విషయాలను వివరించారు. డీఎస్‌ఎన్‌ రాజు స్మారక అవార్డ్స్‌, మెరిట్‌ ధ్రువపత్రాలను మొదటిసంవత్సరం సబ్జెక్టులో ప్రథమస్ధానం సాధించిన కుడి పూడి శ్రీసంధ్య, రెండో స్థానం సాధించిన తిక్క చరిష్మానిఽధి, మాసాఫెలోఫిల్‌లో మొదటి సంవత్సరం టాపర్‌ కుడిపూడి శ్రీసంధ్యలకు అందజేశారు. కార్యక్ర మంలో ప్రిన్సిపాల్‌ పి.విజయనిర్మల, అధ్యాపకులు కె.వి.స్వామి, కె.శామ్యూల్‌ పీటర్‌, కె.సుధారాణి, డి.వి.తేజ, ఎస్‌.వెంకటేశ్వరరావు, అప్పారావు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-02T00:48:32+05:30 IST