రాజమండ్రి అంటే ఇష్టం

ABN , First Publish Date - 2023-07-23T00:50:42+05:30 IST

నాకు రాజమండ్రి అంటే చాలా ఇష్టం.. ఈ చారిత్రాత్మక నగరాన్ని హరిత నగరంగా తీర్చిదిద్దమే లక్ష్యంగా చేపట్టిన ఓ మహాయజ్ఞం ‘యువతా హరితా- గో గ్రీన్‌ ఛాలెంజ్‌’ అని సినీతార కామ్నా జఠ్మలాని పేర్కొన్నారు.

రాజమండ్రి అంటే ఇష్టం
మాట్లాడుతున్న కామ్నా జఠ్మలాని, ఎంపీ భరత్‌

రాజమహేంద్రవరం, జూలై 22(ఆంధ్రజ్యోతి): నాకు రాజమండ్రి అంటే చాలా ఇష్టం.. ఈ చారిత్రాత్మక నగరాన్ని హరిత నగరంగా తీర్చిదిద్దమే లక్ష్యంగా చేపట్టిన ఓ మహాయజ్ఞం ‘యువతా హరితా- గో గ్రీన్‌ ఛాలెంజ్‌’ అని సినీతార కామ్నా జఠ్మలాని పేర్కొన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఎదురుగా నూతనంగా నిర్మించిన డివైడర్లలో లాలా చెరువు నుంచి వేమగిరి జంక్షన్‌ వరకూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మొక్కలు నాటారు. మొక్కలు నాటి సంరక్షించాలని పిలు పునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఓ మొక్కను దత్తతగా తీసుకోవాలన్నారు. ఎంపీ భరత్‌ రామ్‌ మాట్లాడుతూ మానవ మనుగడకు అవసరమైన ఆక్సిజన్‌ కావాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించడం బాధ్య తగా స్వీకరించాలన్నారు.కార్యక్రమంలో వైసీపీ సిటీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌, కడియాల లక్ష్మణరావు, మూర్తి లక్ష్మీ, మార్గాని సురేశ్‌, ఎస్‌ఈ పాండురంగారావు,అడిషల్‌ కమిషనర్‌ సత్యవేణి పాల్గొన్నారు.

Updated Date - 2023-07-23T00:50:42+05:30 IST