వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిక
ABN , First Publish Date - 2023-06-14T00:21:07+05:30 IST
జగ్గంపేట రూరల్, జూన్ 13: మండలంలోని మన్యవారిపాలెం గ్రామానికి చెందిన వైసీపీ నేత ఉప్పుల రామకృష్ణ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నచ్చక ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరామని తెలిపారు. ఈ సందర్భం
జగ్గంపేట రూరల్, జూన్ 13: మండలంలోని మన్యవారిపాలెం గ్రామానికి చెందిన వైసీపీ నేత ఉప్పుల రామకృష్ణ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నచ్చక ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరామని తెలిపారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, అందుకు నిదర్శనంగా వైసీపీ నేతలు టీడీపీలో చేరుతున్నారన్నారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని, ప్రజలకు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళల అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు పొట్రు కృష్ణ, పొట్రు రాముడు, బొడ్డు ఎలకల రాజు తదితరులు పాల్గొన్నారు.