బాధితులను ఆదుకున్న జనసేన
ABN , First Publish Date - 2023-02-14T01:09:25+05:30 IST
రాష్ట్రంలో కుటుంబ ఆధారాన్ని కోల్పోయిన పలు అట్టడుగువర్గాల బాధితులను ఆర్థికంగా, మానసికంగా ఆదుకున్నది కేవలం జనసేన పార్టీ మాత్రమేనని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ పేర్కొన్నారు. సామర్లకోట రైతు భవన్‌లో సోమవారం జనసేన జిల్లా కార్యవర్గ సమావేశం పెద్దాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి తుమ్మలబాబు అధ్యక్షతన నిర్వహించారు. ము ఖ్య అతిథులుగా దుర్గేష్, పీఏసీ సభ్యులు ము
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు దుర్గేష్
సామర్లకోట, ఫిబ్రవరి 13: రాష్ట్రంలో కుటుంబ ఆధారాన్ని కోల్పోయిన పలు అట్టడుగువర్గాల బాధితులను ఆర్థికంగా, మానసికంగా ఆదుకున్నది కేవలం జనసేన పార్టీ మాత్రమేనని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ పేర్కొన్నారు. సామర్లకోట రైతు భవన్‌లో సోమవారం జనసేన జిల్లా కార్యవర్గ సమావేశం పెద్దాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి తుమ్మలబాబు అధ్యక్షతన నిర్వహించారు. ము ఖ్య అతిథులుగా దుర్గేష్, పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణ హాజరయ్యారు. పార్టీ మరింత బలోపే తానికి ప్రతీ కార్యకర్త సైనికుడిలా జనసేన సభ్యత్వ నమోదును విజయవంతంగా పూర్తిచేయాలని దుర్గేష్ కోరారు. జనసేనలో చేరిన సుమారు 70మంది నాయకులకు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. అతిథులను సన్మానించారు. భీమేశ్వరస్వామి చిత్రపటాలను తుమ్మలబాబు అందజేశారు. అత్తి సత్యనారాయణ, మాకినీడి శేషుకుమారి పాల్గొన్నారు.